Telugu News » BRS : మాజీ మంత్రి ఎర్రబెల్లిపై అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు.. మాజీ మంత్రి ఏమన్నారంటే!

BRS : మాజీ మంత్రి ఎర్రబెల్లిపై అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు.. మాజీ మంత్రి ఏమన్నారంటే!

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు‌(Errabelli dayakar rao)పై హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ తనను బంధించి ఆయన సమీప బంధువు విజయ్ పేరిట బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ (Land Illegal Reg చేయించారన్నారు.

by Sai
Illegal registration allegations against former minister Errabelli.. What does the former minister say?

అంతేకాకుండా రెండ్రోజుల పాటు తనను నిర్భంధించి రూ.50లక్షలు ఇవ్వాలని తన కుటుంబ సభ్యులను సైతం బెదిరించినట్టు ఆరోపించారు. ఇదే విషయంపై బాధిత వ్యాపారి శరణ్ చౌదరి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే, ఈ ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, అసలు ఆ విజయ్ కూడా ఎవరో తనకు తెలియదన్నారు. పత్రికల్లో తన అవాస్తవాలు ప్రచురించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఎర్రబెల్లి హితవు పలికారు. విజయ్ అనే వ్యక్తి తన బంధువు కాదని, ఆయనది విజయవాడ అని తెలిపారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో విజయ్ అమెరికా నుంచి తనకు ఓ వీడియో పంపారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.వాస్తవానికి శరణ్ చౌదరి అనే వ్యక్తి దొంగ పత్రాలు క్రియేట్ చేసి తన వద్దనున్న రూ.5 ట్లు తీసుకున్నారని విజయ్ ఆరోపించారు. ఇదే విషయమై అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లిని రిక్వెస్ట్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపారు.తనకు ఎర్రబెల్లికి ఎలాంటి సంబంధం లేదని, బంధుత్వం, వ్యాపార లావాదేవీలు కూడా లేవన్నారు.తనకు ఇంకా ఎర్రబెల్లినే సాయం చేశారని విజయ్ చెప్పుకొచ్చారు.కాగా, తనను పార్టీ మారాలని ఇతర పార్టీల నేతల నుంచి పిలుపులు వస్తున్నాయని, అయినా తాను పార్టీ మారబోనని ఎర్రబెల్లి తెలిపారు.

You may also like

Leave a Comment