Telugu News » సి”రాజ్” ధాటికి విలవిల్లాడిన లంకేయులు.. ఆసియా కప్ మనదే!

సి”రాజ్” ధాటికి విలవిల్లాడిన లంకేయులు.. ఆసియా కప్ మనదే!

ఆసియా కప్-2023 ​ఫైనల్ లో భారత్ ఘన విజయం సాధించింది.

by Ramu

– ఆసియా కప్ లో ఘన విజయం
– ఫైనల్లో చేతులెత్తేసిన లంక
– సిరాజ్ ధాటికి విలవిల్లాడిన లంకేయులు
– 50 పరుగులకే ఆలౌట్
– వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించిన భారత్
– 8వసారి ఆసియాకప్ అందుకున్న రోహిత్ సేన

ఆసియా కప్-2023 ​ఫైనల్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా సిరాజ్ నిప్పులు కక్కే బంతులతో విరుచుకుపడ్డాడు. లంక నిర్దేశించిన చిన్న లక్ష్యాన్ని మనోళ్లు అలవోకగా ఛేదించారు. దీంతో ఎనిమిదో ఆసియా కప్​ టైటిల్ ​ను భారత్ సాధించినట్టైంది.

IND win eighth Asia Cup title with 10 wicket win

 

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది శ్రీలంక జట్టు. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులే చేసి ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు 6.1 ఓవర్లలో పూర్తి చేశారు. భారత స్టార్ పేసర్ సిరాజ్​ ధాటికి నిలబడలేకపోయింది లంక జట్టు. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్​ డిజిట్​ కు పరిమితం అయ్యారు. వారిలో నలుగురు పరుగుల ఖాతానే తెరవలేదు. 17 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. లంక బ్యాటర్లలో​ టాప్​ స్కోరర్.

ముందుగా వికెట్ల పతనానికి బుమ్రా శ్రీకారం చుట్టగా.. దాన్ని సిరాజ్ కొనసాగించాడు. ఆరు వికెట్లను పడగొట్టిన సిరాజ్ లంక జట్టును చిత్తు చేశాడు. హార్దిక్ పాండ్య 3, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. సిరాజ్ ఈ మ్యాచ్​ లో 16 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టి రికార్డ్ నెలకొల్పాడు. శ్రీలంక దిగ్గజం చమిందా వాస్ రికార్డును సమం చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్​ లో సిరాజ్​.. 7 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

You may also like

Leave a Comment