India : దేశంలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ లోతుగా పరిశీలిస్తే 2023 ఆర్ధిక సంవత్సరానికి పన్ను చెల్లించినవారి సంఖ్యను, 2020 ఆర్ధిక సవత్సరంలో చెల్లించిన వారి సంఖ్యను పోల్చి చూడగా ఎన్నో సరిపోలని అంశాలు బయటపడ్డాయి. కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య ఏ ఏడాదికి ఆ ఏడాది 48.4 శాతం ఉండగా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వీరి మొత్తం ఆదాయం పన్ను రిటర్న్ లు మాత్రం కేవలం, 0.2 శాతమేనని తేలింది. దీనికి విరుధ్ధంగా 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారి సంఖ్య దాదాపు 60 శాతమని, ఇది 4.9 శాతం పెరుగుదలేనని వెల్లడైంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి తమ ఆదాయం కోటి రూపాయలకు మించిందని 1,69, 890 మంది తమ టాక్స్ రిటర్నులలో ప్రకటించారు.
.
అయితే 4.65 కోట్ల మంది తాము పన్ను చెల్లించే అవసరం లేదని గానీ.. లేక తమ ఆదాయం 5 లక్షలలోపు మాత్రమేనని గానీ ప్రకటించారు. 2019-2020, 2022-23 సంవత్సరాల మధ్య టాక్స్ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల లోక్ సభలో పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ట్యాక్స్ చెల్లించని వారి సంఖ్య కూడా పెరిగిందన్నారు. అంటే తమ ఆదాయం సాలుకు 5 లక్షలేనని, అందువల్ల తాము పన్ను చెల్లించనక్కరలేదని వారు వివరించినట్టు తేలుతోంది.
పన్ను రాబడుల పెరుగుదలకు దోహదపడే మరో అంశం. మొదటిసారిగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా పెరిగింది. వీరిలో పలువురు పన్ను పరిధిలోకి రాకపోయినా రుణ దరఖాస్తులు, వీసా ప్రాసెసింగ్, ఐటీ ఫైలింగ్ వంటి వాటి కాపీలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ట్యాక్స్ లయబిలిటీ లేకున్నప్పటికీ పన్ను రిటర్నులకు సంబంధించి తమ వివరాలను ప్రకటించే వారి సంఖ్య కూడా పెరగవచ్చునని భావిస్తున్నారు.
రానున్న సంవత్సరంలో కొత్త పన్ను విధానం కింద సుమారు 7 లక్షల ఆదాయానికి జీరో ట్యాక్స్ లయబిలిటీ ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను చండీగఢ్, ఢిల్లీ, గోవా రాష్ట్రాల వారు ఎక్కువగా పన్ను చెల్లించినట్టు వెల్లడైంది. ఇది వరుసగా 23, 17, 15 శాతమని స్పష్టమైంది. ఏమైనా పంజాబ్ అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. ఇందుకు ఈ రాష్ట్రంలోని వ్యవసాయం, ఉత్పాదక రంగం,ట్రేడింగ్ వంటి రంగాలే కారణమని తెలుస్తోంది.