భారత్- మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ (Boycott Maldives )నినాదం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వివాదం నేపథ్యంలో మాల్దీవులను సందర్శించే భారతీయు (Indians)ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత మూడు వారాల్లో మాల్దీవుల టూరిజం ర్యాంకింగ్స్‌లో భారత్ మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడి పోయింది.
గతేడాది డిసెంబర్ 31 నాటికి మాల్దీవుల టూరిజం జాబితాలో ఇండియ మొదటి స్థానంలో ఉంది. ఆ ఏడాది 2,09,198 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. మాల్దీవుల టూరిజం మార్కెట్‌లో భారత్ 11 శాతం వాటాను కలిగి ఉంది. జనవరి 2న ప్రధాని మోడీ లక్షద్వీప్ వెళ్లడం, మాల్దీవుల మంత్రులు భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారత పౌరులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు బాయ్ కాట్ మాల్దీవ్స్ నినాదం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మాల్దీవులను సందర్శించే మాల్దీవుల సంఖ్య గణనీయంగా పడి పోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవుల టూరిజంలో భారత్ వాటా కేవలం 8 శాతం మాత్రమే ఉంది. మొత్తం 13 వేల 989 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఇక చైనా 9.5శాతం, యూకే 8.1శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఈ ఏడాది జనవరిలో మాల్దీవులను సందర్శించిన పర్యాటకుల జాబితాలో రష్యా రష్యా (18,561) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) ఉన్నాయి. ఆరవ స్థానంలో జర్మనీ (10,652), యూఎస్ఏ (6,299), ఫ్రాన్స్ (6,168), పోలాండ్ (5,109), స్విట్జర్లాండ్ (3,330)పదవ స్థానంలో ఉంది.