Telugu News » India-Maldives : చైనా మాయలో మాల్దీవులు.. కీలక అంశాలపై కోర్ కమిటీ సమావేశం..!!

India-Maldives : చైనా మాయలో మాల్దీవులు.. కీలక అంశాలపై కోర్ కమిటీ సమావేశం..!!

మార్చి 15 నాటికి తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల గడువు విధించారు. గతేడాది డిసెంబరులో భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

by Venu

భారత్‌ (India), మాల్దీవుల (maldives) మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకొంది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై శుక్రవారం కోర్‌ కమిటీ (Core Committee) సమావేశం నిర్వహించింది.. ఢిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఈ మీటింగ్ లో ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Maldives: India-Maldives dispute.. President sought China's help..!

ఇదిలా ఉండగా చైనా (China) మాయలో పూర్తిగా పడిపోయిన మాల్దీవ్స్.. ఆదేశపు మాటలు నమ్మి, దశాబ్దాలుగా భారత్‌తో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసుకొంది.. వాస్తవానికి మాల్దీవులు, మొదటి నుంచి భారత్‌కు మిత్ర దేశమే. కానీ చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మార్చి 15 నాటికి తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల గడువు విధించారు. గతేడాది డిసెంబరులో భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పరిష్కారానికి కోర్‌ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని ఇరువురూ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు వారాల క్రితం ఈ కమిటీ మాలెలో భేటీ అయ్యింది.

తాజాగా ఢిల్లీలో మరోసారి సమావేశం నిర్వహించింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని కనుగొనడంపై ఇరు దేశాలు దృష్టి సారించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మాల్దీవుల రాజకీయాల్లో మెల్లమెల్లగా డ్రాగన్ జోక్యం పెరగడంతో ఫలితంగా భారత్‌- మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది.

You may also like

Leave a Comment