Telugu News » Poonam Pandey Death: ‘పూనమ్ బతికే ఉంది.. ఇందంతా పబ్లిసిటీ స్టంట్..’?

Poonam Pandey Death: ‘పూనమ్ బతికే ఉంది.. ఇందంతా పబ్లిసిటీ స్టంట్..’?

పూనమ్ మృతిచెందినట్లు వస్తున్నట్లు వార్తలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూనమ్ పాండే మరణిస్తే.. తన మృతదేహం ఎక్కడ ఉంది? అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేకపోవడమే అందుకు కారణం. మరోవైపు, పూనమ్ బతికే ఉందంటూ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు.

by Mano
Poonam Pandey Death: 'Poonam is alive.. All this is a publicity stunt..'?

బాలీవుడ్ మోడల్, నటి పూనమ్ పాండే(Poonam Pandey) మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. 32 ఏళ్ల వయసులో సర్వైకల్ క్యాన్సర్‌(Cervical cancer)తో పూనమ్ మృతిచెందిందని ఆమె మేనేజర్ ప్రకటించారు. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది పూనమ్ టీమ్.

Poonam Pandey Death: 'Poonam is alive.. All this is a publicity stunt..'?

కానీ పూనమ్ మృతిచెందినట్లు వస్తున్నట్లు వార్తలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. పూనమ్ మరణించిందని టీమ్ చేసిన పోస్ట్ తప్పా ఇంకా ఏ ఆధారం లేదు. చివరికి పూనమ్ పాండే కుటుంబం కూడా ఈ మరణ వార్తపై స్పందించలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పూనమ్ మరణ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఫ్యామిలీ జాడ లేదు.

కేవలం పూనమ్ సోదరి మాత్రమే తన మరణ వార్త గురించి బయటపెట్టింది. ఆ తర్వాత కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో మరోసారి తన అక్కను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తన ఫోన్ రీచ్ అవ్వడం లేదని సమాచారం. అంతే కాకుండా ఒకవేళ పూనమ్ పాండే మరణిస్తే.. తన మృతదేహం ఎక్కడ ఉంది? అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో పాటు ప్రస్తుతం పూనమ్ పాండే నివాసముంటున్న ఇంటి దగ్గర కూడా విచారణ జరపగా.. అక్కడ ఎవరికీ ఈ విషయం గురించి తెలియదని తెలుస్తోంది. మరోవైపు, ఫ్యాషన్, సినీ విమర్శకుడు ఉమైర్ సంధు తన ట్వీట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పూనమ్ బతికే ఉందని, ఆమె మరణ వార్తను ఆమె ఆనందిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను పూనమ్ కజిన్‌తో మాట్లాడానని, ఇది పూనమ్ పబ్లిసిటీ స్టంట్ అంటూ ఉమైర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే నెటిజన్లు మాత్రం తమకు రుజువు కావాలని కామెంట్స్ చేశారు.

You may also like

Leave a Comment