Telugu News » India-Maldives : భారత్ పై విషం చిమ్ముతున్న మాల్దీవుల అధ్యక్షుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ముయిజ్జు..!

India-Maldives : భారత్ పై విషం చిమ్ముతున్న మాల్దీవుల అధ్యక్షుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ముయిజ్జు..!

తన ప్రసంగాన్ని కొనసాగించిన మహమ్మద్ ముయిజ్జు.. మాల్దీవుల సార్వభౌమాధికారంలో ఏ దేశాన్ని జోక్యం చేసుకోవడానికి అనుమతించమని భారత్‌పై విరుచుకుపడ్డారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయని పేర్కొన్నారు.

by Venu

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు ముయిజ్జు (muizzu) పదవి చేపట్టినప్పటి నుంచి భారత్ (Bharath) పై విషం చిమ్ముతున్న విషయం తెలిసిందే.. భారత్ పై వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్న ఈయన నేడు మాల్దీవుల పార్లమెంటులో తన ప్రసంగం సందర్భంగా.. మరోసారి భారత్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల ప్రజలు భారత సైనికులను తరిమికొట్టేందుకే తనకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు.

తన ప్రసంగాన్ని కొనసాగించిన మహమ్మద్ ముయిజ్జు.. మాల్దీవుల సార్వభౌమాధికారంలో ఏ దేశాన్ని జోక్యం చేసుకోవడానికి అనుమతించమని భారత్‌పై విరుచుకుపడ్డారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయని పేర్కొన్నారు. ఇందుకు భారతదేశం, మాల్దీవులు అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే, ముయిజ్జు పార్లమెంట్‌లో ఖాళీ కుర్చీలకు తన ప్రసంగం వినిపించాడు.

భారత్ పై వ్యతిరేక వైఖరి కారణంగా విపక్షాలు ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. ఈయన ప్రసంగానికి ముందే మాల్దీవియన్ డెమోక్రటిక్- డెమొక్రాట్స్ పార్టీలు పార్లమెంట్ కు వచ్చేందేకు నిరాకరించాయి. అధ్యక్షుడు మాల్దీవుల పార్లమెంటుకు చేరుకునే సరికి దాదాపు చాలా సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయినా ముయిజ్జు తన ప్రసంగం మొదలు పెట్టేటప్పటికి కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే సభలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మరోవైపు మొత్తం 87 స్థానాలున్న మాల్దీవుల పార్లమెంటులో 56 మంది ఎంపీలు ముయిజ్జు ప్రసంగాన్ని బహిష్కరించారు. వీరిలో డెమోక్రాట్‌ల నుంచి 13 మంది, ఎమ్‌డీపీకి చెందిన 43 మంది ఎంపీలు ఉన్నారు. కాగా మాల్దీవుల పార్లమెంటు చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ అని స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈమేరకు MDP-డెమొక్రాట్‌లు.. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించాయి..

You may also like

Leave a Comment