Telugu News » Yellandu: ఇల్లందు మున్సిపల్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. లాఠీచార్జ్..!

Yellandu: ఇల్లందు మున్సిపల్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. లాఠీచార్జ్..!

భద్రాద్రి కొత్తగూడెం జల్లా (Bhadradri Kothagudem District) ఇల్లందు మున్సిపల్‌ కార్యాలయం(Illandu Municipal Office) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం కాస్త రణరంగంగా మారింది.

by Mano
Yellandu: Extreme tension at Yellandu Municipal Office.. Lathi charge..!

భద్రాద్రి కొత్తగూడెం జల్లా (Bhadradri Kothagudem District) ఇల్లందు మున్సిపల్‌ కార్యాలయం(Illandu Municipal Office) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడి చేశారు. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ఏర్పాటుచేసిన ప్రత్యేకంగా సమావేశం కాస్త రణరంగంగా మారింది.

Yellandu: Extreme tension at Yellandu Municipal Office.. Lathi charge..!

ఇల్లందు మున్సిపల్ చైర్మన్((Illandu Municipal Chairman) దుమ్మాలపాటి వెంకటేశ్వరారావు(Dummalapati Venkateswara Rao) పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఏకంగా 17మంది కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోనుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్‌ నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా తీసుకెళ్లింది.

మరోవైపు సీపీఐ కౌన్సిలర్‌ను ఆ పార్టీ నాయకులు తమవెంట తీసుకెళ్లారు. మున్సిపల్‌ కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యాకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు ఎక్కువ చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 144 సెక్షన్ వర్తించినట్లు పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. సీపీఐ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లను తీసుకెళ్తుండగా అడ్డుకోవడంతో రెచ్చిపోయిన హస్తం పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

You may also like

Leave a Comment