Telugu News » IndiGo flight : పాస్‌పోర్టు లేకుండా బంగ్లాదేశ్ వెళ్ళిన ప్రయాణికులు..!!

IndiGo flight : పాస్‌పోర్టు లేకుండా బంగ్లాదేశ్ వెళ్ళిన ప్రయాణికులు..!!

కాగా గువాహటికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢాకాకు విమానాన్ని మళ్లించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఇండిగో ఫ్లైట్ ఎక్కిన తాము పాస్‌పోర్టులు లేకుండానే అంతర్జాతీయ సరిహద్దు దాటి సేఫ్ గా ఢాకాలో ల్యాండ్ అయినట్టు సూరజ్ తెలిపారు..

by Venu

ముంబై (Mumbai) నుంచి గువాహటి (Guwahati) వెళ్లాల్సిన ఇండిగో విమానం (IndiGo flight) బంగ్లాదేశ్ రాజధాని, ఢాకా (Dhaka)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) అయింది. వాతావరణంలో మార్పుల వల్ల.. నేటి ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకొంది. ఈ కారణంగా ఢాకా వెళ్లి అక్కడ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని సమాచారం.

తీవ్రమైన మంచు ప్రభావంతో గువాహటి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సాధ్యపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మరోవైపు ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో పాల్గొనేందుకు ఇంఫాల్‌కు వెళ్తున్నానని, ఇంతలో ఇలా జరిగిందని వివరించారు.

కాగా గువాహటికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢాకాకు విమానాన్ని మళ్లించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఇండిగో ఫ్లైట్ ఎక్కిన తాము పాస్‌పోర్టులు లేకుండానే అంతర్జాతీయ సరిహద్దు దాటి సేఫ్ గా ఢాకాలో ల్యాండ్ అయినట్టు సూరజ్ తెలిపారు..

ఇందులో ప్రయాణించిన ప్రయాణికులు ఇంకా విమానంలోనే ఉన్నారని.. 9 గంటలుగా విమానంలో చిక్కుకొని ఉన్నామన్నారు. గువాహటి చేరుకున్నాక అక్కడి నుంచి ఇంఫాల్‌కు వెళ్తానని, సూరజ్ సింగ్ ఠాకూర్ మరో పోస్టులో పేర్కొన్నారు. అయితే విమానాన్ని ఢాకాకు మళ్లించడంపై, ఇండిగో ఎయిర్ లైన్స్ ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని సమాచారం..

You may also like

Leave a Comment