Telugu News » Indrakeeladri: 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం.. దుర్గాష్టమి విశిష్టత ఏంటంటే?

Indrakeeladri: 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం.. దుర్గాష్టమి విశిష్టత ఏంటంటే?

దుర్గాదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో దుర్గమాసురుడు అనే రాక్షసుడిని అష్టమి తిథి రోజున సంహరించింది. అందుకే దుర్గగా కీర్తించబడింది.

by Mano
Indrakeeladri: Darshan of Goddess Durga on the 8th day.. What is special about Durgashtami?

ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి ఉత్సవాలు 8వరోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారం(Durgadevi avathar)లో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 3గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు.

Indrakeeladri: Darshan of Goddess Durga on the 8th day.. What is special about Durgashtami?

దుర్గాదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో దుర్గమాసురుడు అనే రాక్షసుడిని అష్టమి తిథి రోజున సంహరించింది. అందుకే దుర్గగా కీర్తించబడింది. నవరాత్రుల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమీయడంలో ఎంతో ప్రాచుర్యత దాగి ఉంది. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాడ విశ్వాసం.

దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై స్వయంగా అష్టమి తిధినాడు ఆవిర్బవించింది. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను చేకూరుస్తుంది.

అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్టించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలికింద దుర్గమాసురుడు మహిషురుణ్ని తొక్కిపట్టి ఉంచుతూ దర్శనమిస్తుంది. ఈరోజు దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దుర్గాష్టమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు పోయి సద్గతులు ప్రసాదించబడతాయని భక్తుల విశ్వాసం.

You may also like

Leave a Comment