Telugu News » Indrakeeladri: ఐదో రోజు మహా చండీ దేవిగా కనకదుర్గమ్మ.. ఈ అలంకరణ వెనక రహస్యం ఇదే..!

Indrakeeladri: ఐదో రోజు మహా చండీ దేవిగా కనకదుర్గమ్మ.. ఈ అలంకరణ వెనక రహస్యం ఇదే..!

కనక దుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై 70 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మహా చండీ దేవిగా (Maha Chandi Alankaram) భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకారం ప్రత్యేకత ఏంటంటే.. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది..

by Venu

విజయవాడ (vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకొంటున్నారు భక్తులు. కాగా బ్రహ్మాండనాయకి అయిన బెజవాడ (Bejawada)కనకదుర్గమ్మ ( Kanakadurgamma) మహోత్సవాలు నేటితో ఐదవ రోజుకు చేరాయి. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మరోవైపు రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఐదో రోజు మహా చండీ దేవిగా దర్శనమిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తోంది.

ఇక్కడ మరో విశేషం ఉంది. కనక దుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై 70 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మహా చండీ దేవిగా (Maha Chandi Alankaram) భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకారం ప్రత్యేకత ఏంటంటే.. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.. అనేకమంది దేవతలు చండీ అమ్మవారిలో కొలువై ఉండటం వల్ల.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించిన ఫలితం వస్తుందని అంటున్నారు పండింతులు.

అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారుతారని.. కోరిన కోర్కెలు సత్వరమే నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఇక ప్రతి ఏటా ఐదవ రోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో దర్శనం ఇచ్చే అమ్మవారు ఈ సారి చండి అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది అంటున్నారు.

ఈ ఏడాది అధిక శ్రవణం, తిథి హెచ్చుతగ్గుల్లో తేడా రావటంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. మరోవైపు అక్టోబరు15న ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.. కాగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు..

You may also like

Leave a Comment