Telugu News » Iran-Israel: ఇరాన్‌కు ఝలక్.. ఈసారి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయెల్..!

Iran-Israel: ఇరాన్‌కు ఝలక్.. ఈసారి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయెల్..!

. ఇటీవల వందలాది మిస్సెల్స్‌, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. మిడిల్ ఈస్ట్‌లో భయానక వాతావరణం నెలకొంది.

by Mano
Iran-Israel: A blow to Iran.. This time it was Israel that launched the missile..!

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌(Iran)కు ఇజ్రాయెల్(Israel) ఝలక్ ఇచ్చింది. ఇటీవల వందలాది మిస్సెల్స్‌, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. మిడిల్ ఈస్ట్‌లో భయానక వాతావరణం నెలకొంది. అయితే, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ చెప్పినట్లుగానే ఇరాన్‌లోని ఒక సైట్ పైకి క్షిపణిని ప్రయోగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Iran-Israel: A blow to Iran.. This time it was Israel that launched the missile..!

ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం(Embassy of Iran)పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్పస్‌కు చెందిన ఇద్దరు కీలక జనరల్స్‌తో పాటు పలువురు ఇరాన్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడితో ప్రతీకార చర్యగా ఇరాన్ గత శనివారం ఇజ్రాయిల్‌పై దాడి చేసింది.

ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా వరకు ఇరాన్ డ్రోన్లు, మిస్సెళ్లను ఆకాశంలోనే అడ్డుకుని కుప్పకూల్చాయి. గురువారం ఐక్యరాజ్యసమితి ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా తదుపరి సైనిక చర్యలకు పాల్పడకుండా ఆపాలని ఇరాన్ యూఎన్‌కు సూచించింది.

అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ గురువారం ఆలస్యంగా ఈ విషయాన్ని నివేదించింది. ఇరాన్ నగరంలోని ఇసాఫహాన్‌లోని విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్‌కు చెందిన ఫార్స్ ఆ మీడియా సంస్థ తెలిపింది. దీంతో అనేక విమానాలు ఇరాన్ గగనతలం నుంచి మళ్లించబడ్డాయని పేర్కొంది.

You may also like

Leave a Comment