Telugu News » Christmas : క్రిస్మస్ వల్ల ఇంత కాలుష్యమా? అదే.. హిందూ పండుగలైతే..?

Christmas : క్రిస్మస్ వల్ల ఇంత కాలుష్యమా? అదే.. హిందూ పండుగలైతే..?

కేవలం హిందూ పండుగలప్పుడే పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రశ్నించే వారు.. క్రిస్టియన్లు, ముస్లింల పండుగల సమయంలోనూ నోరెత్తితే బాగుంటదనేది హిందూ సంఘాల వాదన.

by admin

– దీపావళి వస్తే కాలుష్యమంటారు
– వినాయక నిమజ్జనాన్ని అడ్డుకుంటారు
– కానీ, క్రిస్మస్ పేరుతో చెట్లు నరికేస్తున్నా పట్టించుకోరు
– ముస్లింల పండుగలప్పుడు జంతువుల్ని వధిస్తున్నా మౌనం వీడరు
– హిందూ పండుగుల సమయంలోనే నోరెత్తుతారా?
– నిలదీస్తున్న హిందూ సంఘాలు

పండుగ అంటే ఎవరైనా సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు..? ఎవరి ఆచారాలకు తగ్గట్టు వారు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ, హిందూ పండుగలు వస్తే మాత్రం కొందరికి కోర్టులు గుర్తొస్తాయి. మిగిలిన మతాల వారి పండుగల సమయంలో గప్ చుప్ గా ఉంటూ.. కేవలం హిందూ పండుగలప్పుడే నానా రాద్ధాంతం చేస్తారు? కోర్టుల్లో పిటిషన్లు వేసి అడుగడుగునా అడ్డుకునే కుట్రలు చేస్తుంటారు. కానీ, ఇతర మతాల పండుగలప్పుడు మాత్రం మాట మాట్లాడరు. క్రిస్మస్ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి హిందూ సంఘాలు.

is-christmas-increasing-environmental-pollution

వినాయక చవితి, దీపావళి వస్తే రాద్ధాంతం

హిందువులను, హిందూ ఆచారాలను అవహేళన చేయడం కొందరికి అలవాటుగా మారిపోయింది. దీపావళికి టపాసులు కాలిస్తే కాలుష్యమని అంటారు. 364 రోజులు గుర్తుకురాని కాలుష్యం పేరు.. ఆ ఒక్క రోజు మోత మోగిపోతుంది. కేవలం హిందూ పండుగైన దీపావళి వల్లే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందనే భ్రమను క్రియేట్ చేస్తుంటారు. నిజానికి దీపావళి నాడు వచ్చే కాలుష్యం 4 నుంచి 5 శాతం మాత్రమేనని పర్యావరణ వేత్తలు చెబుతుంటారు. మిగిలిన రోజుల్లో వ్యర్థాల కాల్చివేత, వాహనాల పొగ, పారిశ్రామిక, నిర్మాణ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం 95 శాతం ఉంటుంది. దీని గురించి ఏనాడూ మాట్లాడని వారు దీపావళి వచ్చిందంటే నానా రాద్ధాంతం చేస్తుంటారు. ఇక, వినాయక చవితి వచ్చినా అంతే. నిమజ్జనం విషయంలో అనేక ఆంక్షలు ఉంటాయని గుర్తు చేస్తున్నాయి హిందూ సంఘాలు.

is-christmas-increasing-environmental-pollution 2

క్రిస్మస్ వస్తే విపరీతంగా చెట్ల నరికివేత, వ్యర్థాలు

క్రిస్మస్ నాడు క్రిస్టియన్లు ఇంట్లో చెట్లను పెట్టి అందంగా అలంకరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25 వస్తే ప్రపంచ దేశాల్లో లక్షల చెట్లు నరుకుతారు. కొన్నిచోట్ల టపాసుల మోత మోగుతుంది. దీని వల్ల పర్యావరణానికి ప్రమాదమనేది కొందరి వాదన. అయినా, ఆ నరికివేత ఆగదు. హిందూ పండుగులప్పుడు హడావుడి చేసే బ్యాచ్ మౌనం వీడదు. అందుకే, ఇలాంటి వారికి బుద్ధి వచ్చేందుకు ప్రతీ ఏడాది క్రిస్మస్ క్యాంపెయిన్ చేస్తున్నామని అంటున్నాయి హిందూ సంఘాలు. ‘‘దయచేసి క్రిస్మస్ కి బాణసంచా కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడండి. కొవ్వొత్తులు వెలిగించి ఓజోన్ పొరకి హాని చేయకండి. చెట్లు నరకకండి. భూమిని కాపాడండి. శాంతాక్లాజ్ దుస్తులకు బదులు ఆ డబ్బులతో మామూలు డ్రెస్ లు కొని పేదలకు పంచండి. కేకులు కొనకండి.. ఆ డబ్బులతో పేదల కడుపులు నింపండి. కాలుష్యం లేని క్రిస్టమస్ జరుపుకుందాం.. పర్యావరణానికి మేలు చేద్దాం’’ అని ప్రచారం చేస్తున్నాయి.

is-christmas-increasing-environmental-pollution 1

ముస్లింల పండుగలప్పుడూ అంతే..!

కేవలం హిందూ పండుగలప్పుడే పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రశ్నించే వారు.. ముస్లింల పండుగల సమయంలోనూ నోరెత్తితే బాగుంటదనేది హిందూ సంఘాల వాదన. కోట్లలో గొర్రెలు, బర్రెలు, ఆవుల్ని వధించి జరుగుతున్న హింసపైనా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీసారీ హిందూ పండుగులపై పడడం కాదు.. వీటిపైనా స్పందించాలని నిలదీస్తున్నాయి హిందూ సంఘాలు.

You may also like

Leave a Comment