Telugu News » KCR : కక్ష.. కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్ పై గులాబీ బాస్ గరంగరం

KCR : కక్ష.. కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్ పై గులాబీ బాస్ గరంగరం

ఒక్క బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా, మిగిలిన బ్లాక్ లు వందేళ్లు అయినా పని చేస్తాయని చెప్పారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని, ఆ కోపంతోనే తనపై కక్ష పెంచుకుని ఉండొచ్చని మాట్లాడారు.

by admin
Has Bhasmasura been handed to KCR for that one mistake.. Has the name of Telangana Bapu faded?

– బీఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవిత అరెస్ట్
– ఆడపిల్ల అని చూడకుండా నిర్బంధించారు
– మోడీ ఘోరమైన పాపం చేశారు
– ఢిల్లీ మద్యం పాలసీలో స్కామే లేదు
– అంతా నరేంద్ర మోడీ పొలిటికల్‌ స్కీమే
– ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్
– అందుకే, నాపై కక్ష పెంచుకున్నారు
– కాళేశ్వరం డిజైన్ నాది కాదు
– చిల్లర రాజకీయం కోసం ప్రాజెక్టును బలి చేస్తే ఊరుకోం
– టన్నెల్స్‌కు ఏమైనా అయ్యిందా?
– నదుల మీద బ్యారేజీలను ఎప్పటికప్పుడు మెయింటైన్‌ చేస్తూ ఉండాలి
– నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టు లేచిపోతుంది
– నా ఆనవాళ్లు తీసేయాలంటే తెలంగాణనే తీసేయాలి
– మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణను పదేళ్లు పదేళ్లు పాలించారు కేసీఆర్. ఇన్నేళ్లలో టీవీ డిబేట్లలో ఆయన పాల్గొన్నది లేదు. ప్రత్యేక రాష్ట్రానికి ముందు పాల్గొన్నారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఓ ఛానల్ కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్ పాలన, కవిత అరెస్ట్, మేడిగడ్డ డ్యామేజ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అది జరిగే పనేనా? అని ప్రశ్నించారు. సీఎం కుర్చుంటున్న సెక్రటేరియట్ కట్టింది ఎవరు? అక్కడ తన ఆనవాళ్లు లేవా? అని నిలదీశారు. ఎమ్మెల్యేలు ఉంటున్న ఇళ్లు కట్టిందెవరు? యాదాద్రి ఆలయం నిర్మించింది ఎవరు? బ్యారేజీలు కట్టిందెవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

First question in BRS bus trip.. KCR sir, why did you cry all this time?

తన ఆనవాళ్లు తీసేయాలంటే తెలంగాణనే తీసేయాలని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపైనా కేసీఆర్ స్పందించారు. ప్రచారంలో ఉన్నట్టు కాళేశ్వరం డిజైన్ తాను చేయలేదని అన్నారు కేసీఆర్. అంతర్రాష్ట్ర వివాదాలు, ముంపు సమస్యలను దృష్టిలో పెట్టుకుని కన్నెపల్లికి దగ్గరలో కడితే మేడిగడ్డ లేకుండా నీళ్లు తీసుకోవచ్చిన ఇంజనీర్లు చెప్పారన్నారు. దాని ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ కట్టామని, ఇప్పుడు బ్యారేజీ లేకుండానే నీళ్లు తీసుకుంటున్నామని తెలిపారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా వందల టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చని వివరించారు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.

ఒక్క బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా, మిగిలిన బ్లాక్ లు వందేళ్లు అయినా పని చేస్తాయని చెప్పారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని, ఆ కోపంతోనే తనపై కక్ష పెంచుకుని ఉండొచ్చని మాట్లాడారు. అంతకుమించి తమ మధ్య ఏ గొడవలు లేవన్నారు. తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయని, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. ఇక, ఢిల్లీ లిక్కర్ కేసుపై స్పందిస్తూ, కవిత కడిగిన ముత్రంలా బయటకు వస్తుందని చెప్పారు. అసలు, ఈ పాలసీలో స్కామ్ లేదని, మోడీ పొలిటికల్ స్కీమే ఉందని ఆరోపించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై కేసు పెట్టామని, ఆ కక్షతోనే ఆడపిల్ల అని చూడకుండా తన కూతుర్ని నిర్బంధించి, ఎన్నికల ముందు అపఖ్యాతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులో ఆరోపణలున్న వ్యక్తి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వగానే బెయిల్ వచ్చిందని వివరించారు.

You may also like

Leave a Comment