Telugu News » Congress : ఈటల-కేటీఆర్-కేసీఆర్ ఒక్కటే.. అందుకే ఆ పని చేయడం లేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

Congress : ఈటల-కేటీఆర్-కేసీఆర్ ఒక్కటే.. అందుకే ఆ పని చేయడం లేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బిడ్డ బెయిల్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తాకట్టు పెట్టాడని సృష్టంగా అర్థం అవుతున్నట్లు ఆరోపించారు. అక్రమంగానైనా అధికారంలోకి రావాలని మోడీ అనుకుంటున్నారని మండిపడ్డారు.

by Venu
If you don't want reservations, vote for BJP. If you want, vote for Congress!

లోక సభ ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రత్యర్థి పార్టీలపై దూకుడుగా వ్యవహరించడం కనిపిస్తోంది. పలు ప్రశ్నలతో సవాళ్ళు విసురుతూ బీఆర్ఎస్, బీజేపీని ఇరుకున పెట్టె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.. ఈటలకి వ్యతిరేకంగా కేటీఆర్, కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు..

Sugarcane farmers are the target..Nizamabad Lok Sabha election is the only slogan!రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ (Congress)కి మద్దతు ఇవ్వండని తెలిపిన సీఎం.. బీజేపీ (BJP) అభ్యర్థి గెలుస్తాడని మల్లారెడ్డి బహిరంగంగా వెల్లడించడం దేనికి సంకేతం అన్నారు.. పది సంవత్సరాల మోడీ (Modi) ప్రభుత్వాన్ని వదిలేసి వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ (KCR) టార్గెట్ చేయడం చూస్తే.. అధికారం లేకుంటే బ్రతలెనన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు..

బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఈ దేశ బీసీ, ఓబీసీలపై మోడీ సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే బీసీ జనాభా లెక్కించడం చారిత్రాత్మక అవసరం అని వెల్లడించారు.. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ అనేక కార్యక్రమాలు చేసిందన్న ఆయన.. వీటి రద్దుకు కుట్ర జరుగుతుంటే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు..

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బిడ్డ బెయిల్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తాకట్టు పెట్టాడని సృష్టంగా అర్థం అవుతున్నట్లు ఆరోపించారు. అక్రమంగానైనా అధికారంలోకి రావాలని మోడీ అనుకుంటున్నారని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రశ్నలకు మోడీ, అమిత్ షా, నడ్డా దగ్గర సమాధానం లేదని పేర్కొన్నారు.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతుంటే ఈటల రాజేందర్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు.

మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈటలకి భూముల అమ్మకం గుర్తు రాలేదా అని ప్రశ్నించిన సీఎం.. రైతులు చావాలని కేసీఆర్, ఈటల కోరుకుంటున్నట్లు ఆరోపించారు. కేటీఆర్ చిన్న పిల్లాడు. కేసీఆర్ ఏమైనా విమర్శలు చేస్తే ఖచ్చితంగా స్పందిస్తా అని తెలిపారు.. బీఆర్ఎస్ ను జనం బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదని ఎద్దేవా చేసిన రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోంది. తుది నివేదిక వచ్చే వరకు నేనేం స్పందించనని వెల్లడించారు.

రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు ఈటలనే అర్థిక మంత్రిగా ఉన్నారని గుర్తు చేసిన రేవంత్.. 7 లక్షల కోట్ల అప్పుతో మేం ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని పేర్కొన్నారు.. అందుకే దుబారా ఖర్చులు పూర్తిగా అపేసినట్లు తెలిపారు. రుణమాఫీ ఎలా చేయాలనే స్ట్రాటజీ నా దగ్గర ఉందని అన్నారు..

You may also like

Leave a Comment