Telugu News » Telangana : కాంగ్రెస్ కు అగ్ని పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికలు.. అప్పటి వరకు అంతా గప్ చుప్..!

Telangana : కాంగ్రెస్ కు అగ్ని పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికలు.. అప్పటి వరకు అంతా గప్ చుప్..!

తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలోనే కాంగ్రెస్ నేతలు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.. ఈ క్రమంలో ఓ పదహారు మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

by Venu
CM Revanth Reddy: Revanth Reddy will go to his own land for the first time as CM..!

ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో రాజకీయాలు మేక పులి ఆటలా సాగుతున్నాయని అంటున్నారు.. బీఆర్ఎస్ (BRS)ను పూర్తిగా ఖాళీ చేయాలని భావించిన కాంగ్రెస్ (Congress)కు ఒకరకంగా నిరాశ ఎదురవుతుందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి హస్తాన్ని అందుకోవాల వద్దా అనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Congress graph down in Malkajigiri.. What is in the report of strategist Sunil Kanugulu?మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకంటే ముందే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ బీరాలు పలికింది. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన కారణాలతో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు వెనుకడుగు వేస్తున్నారు. శనివారం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (Prakash Goud) కూడా చివరి క్షణంలో వెనుకడుగు వేయడం జరిగింది.

ఇదిలా ఉండగా తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలోనే కాంగ్రెస్ నేతలు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.. ఈ క్రమంలో ఓ పదహారు మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వారంతా ఈ విషయాన్ని ఖండించారు.. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు అంత ఆసక్తి చూపించకపోయినా బీఆర్ఎస్ లో మాత్రం ఎవరూ యాక్టివ్ గా ఉండటం లేదనే ప్రచారం జరుగుతోంది.

పార్టీలో తాము ఉన్నట్లు నామమాత్రంగా ప్రవర్తిస్తున్నారు.. అప్పుడప్పుడు సమావేశాలకు హాజరవుతున్నారు.. కానీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ పరిణామాలను బట్టి చూస్తే ఎన్నికల తర్వాత కుదిరితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే భావనలో ఉన్నట్లుగా చర్చించుకొంటున్నారు.. అదీగాక ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుదనుకుంటేనే ఆ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది..

You may also like

Leave a Comment