Telugu News » BRS : బీఆర్ఎస్ పాపం పండిందా..??

BRS : బీఆర్ఎస్ పాపం పండిందా..??

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలు బీఆర్ఎస్‌ ఓటమికి ప్రకృతి సంకేతాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక సమస్య తలెత్తుతోంది.

by Venu

– పదేపదే ఆగిపోతున్న కేసీఆర్ హెలికాప్టర్
– ఎన్నికల ప్రచారంలో పడిపోయిన కేటీఆర్
– కాళేశ్వరంతో ఇమేజ్ అంతా డ్యామేజ్
– వరుస ఘటనలు దేనికి సంకేతం?
– బీఆర్ఎస్ పాపం పండిందంటూ..
– సోషల్ మీడియాలో జోరుగా చర్చ

తెలంగాణ ప్రజలు కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడానికి ఒక బలమైన నాయకుడు వచ్చాడని ఆనాడు రాష్ట్ర ప్రజలు భావించారు. గులాబీ ఉద్యమం.. స్వరాష్ట్ర సాధన కోసం ఊపిరి పోసుకుందని ఆశపడ్డారు. కానీ, యువత కలలు.. కల్లలుగా మారాయని నిరాశ చెందుతున్నారు. ఉద్యమానికి ముందు మన రాష్ట్రం.. మన బతుకులు.. మన కలలు.. మన ఆశలు.. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇవే ప్రతిజ్ఞలు ప్రతి యువత గుండె చప్పుడులో కలిసి పోయాయి. చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది.

బీఆర్ఎస్ లో ఉద్యమకారుల ఉనికిని మెల్లగా మెల్లగా సమాధి చేశారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణకు ఏదో మంచి జరుగుతుందని యువత టీఆర్ఎస్ ని నమ్మిందని.. చివరకు ఉద్యమ పార్టీ కాస్తా.. రాజకీయ పార్టీగా మారిందని చెబుతున్నారు. అయితే.. మూడోసారి సీఎం అయ్యి రికార్డ్ బద్దలు కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్.. ఒక్కసారిగా ఊపిరి పోసుకుంది. దీంతో బీఆర్ఎస్‌ బాస్ కి ఎదురు లేదని భావిస్తున్న క్రమంలో హస్తం ఆయువు పోసుకోవడం.. మింగుడు పడటం లేదని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శించడం కనిపిస్తూనే ఉంది.

ఈ సమయంలో ఎన్నికలు రావడం.. ప్రచారాల జోరు పెరగడం జరిగిపోయింది. అయితే.. బీఆర్ఎస్‌ ప్రచారం చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలు బీఆర్ఎస్‌ ఓటమికి ప్రకృతి సంకేతాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక సమస్య తలెత్తుతోంది.

ఆర్మూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా.. గ్రిల్ ఊడిపోయి కేటీఆర్ ముందుకు ఒరిగిపడగా.. జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి ఇద్దరూ పైనుంచి కింద పడిపోయారు. అంతకు ముందు దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి జరగడం.. ఇవన్నీ అపశకునాలే అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పాపం పండిందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

 

You may also like

Leave a Comment