Telugu News » Israel Hamas Conflict: ఇజ్రాయెల్ ప్రధానితో అజిత్ డొభాల్ భేటీ.. యుద్ధంపై చర్చ..!

Israel Hamas Conflict: ఇజ్రాయెల్ ప్రధానితో అజిత్ డొభాల్ భేటీ.. యుద్ధంపై చర్చ..!

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ , యెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. హమాస్‌పై గాజాలో జరుగుతున్న యుద్ధంపై చర్చించారు. బందీల విడుదల, మానవతా సాయం అందజేత వంటి అంశాలను ప్రస్తావించారు.

by Mano
Israel Hamas Conflict: Ajit Dobal met with the Prime Minister of Israel.. Discussion on the war..!

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ (Ajit Doval) సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. హమాస్‌పై గాజాలో జరుగుతున్న యుద్ధంపై చర్చించారు. బందీల విడుదల, మానవతా సాయం అందజేత వంటి అంశాలను ప్రస్తావించారు. డొభాల్‌తో భేటీ, చర్చించిన అంశాలను నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయం ఎక్స్‌(x)లో పోస్ట్ చేసింది.

Israel Hamas Conflict: Ajit Dobal met with the Prime Minister of Israel.. Discussion on the war..!

నెతన్యాహు విధానాలు సొంత దేశాన్నే గాయపరుస్తున్నాయని బైడెన్ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత ఇస్మాయిల్ హనియే అన్నారు. అయితే, గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, అక్కడి నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణే అసలైన పరిష్కారమని చెప్పారు.

అజిత్ డొభాల్‌ భేటీకి ముందు అక్టోబర్ 7 తరహాలో హమాస్ మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ప్రమాదం ఉండొద్దని నెతన్యాహు అన్నారు. ఆ లక్ష్యంతోనే యుద్ధం కొనసాగిస్తున్నామని తెలిపారు. ‘హమాస్ ఉగ్రవాద ఆర్మీ’ని పూర్తిగా ఏరిపారేస్తామని పేర్కొన్నారు.  అందులో భాగంగా రఫాలోనూ సైనిక చర్య ఉంటుందని పునరుద్ఘాటించారు. మరో రెండు నెలల పాటు యుద్ధం కొనసాగుతుందని తెలిపారు.

రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ఇరుపక్షాల మధ్య సంధి కుదుర్చాలని అమెరికా సహా మరికొన్ని దేశాలు కలిసి విఫలయత్నం చేశాయి. కచ్చితమైన సమయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు గాజాపై పోరులో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తప్పుబట్టడంపై నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ అభిష్టానికి విరుద్ధంగా తాను సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తే అది పొరపాటని వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment