Telugu News » Israel-Hamas War: గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి.. 50మంది మృతి..!

Israel-Hamas War: గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి.. 50మంది మృతి..!

ఇజ్రాయెల్ దళాలు గాజా(Gaza)లోని దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌(Khan Unis)పై దాడికి దిగాయి.  దీంతో జనవరి 22న రాత్రి దాదాపు 50 మంది మృతిచెందారు.

by Mano
Israel-Hamas War: Israeli attack on Gaza hospital.. 50 dead..!

ఇజ్రాయెల్ దళాలు గాజా(Gaza)లోని దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌(Khan Unis)పై దాడికి దిగాయి.  దీంతో జనవరి 22న రాత్రి దాదాపు 50 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్(Israel) దళాలు ఒక ఆసుపత్రిపై దాడి చేసి మరొక ఆసుపత్రిని ముట్టడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది.

Israel-Hamas War: Israeli attack on Gaza hospital.. 50 dead..!

దక్షిణ గాజాలోని ప్రధాన నగరమైన ఖాన్ యూనిస్‌కు పశ్చిమాన మధ్యధరా తీరానికి సమీపంలో ఉన్న అల్-మవాసి జిల్లాలోకి మొదటిసారిగా దళాలు చేరుకున్నాయి. అల్-ఖైర్ ఆసుపత్రిని ముట్టడించి, వైద్య సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వేలాది మంది పాలస్తీనియన్లను మరింత దక్షిణం వైపునకు పారిపోయారు. కుటుంబాలు తీరప్రాంత రహదారిపై నడకదారి పట్టారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 25వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే వెల్లడించింది. ఇది అక్టోబర్ 7 న గాజాలో ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో సుమారు 1200 మందిని చనిపోగా, 250 మంది బందీలను చేసుకున్నారు.

ఐక్యరాజ్యసమితి ప్రకారం, గాజాలోని 2.3 మిలియన్ల నివాసితులలో 85శాతం మందిని ఈ యుద్ధం తరలివెళ్లేలా చేసింది. వారిలో నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు, హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని బందీల బంధువుల నుంచి ప్రధానమంత్రి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

You may also like

Leave a Comment