Telugu News » IT Raids : కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు… ఆందోళనకు దిగిన కార్యకర్తలు…..!

IT Raids : కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు… ఆందోళనకు దిగిన కార్యకర్తలు…..!

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా ఐటీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు.

by Ramu
it raids on congress leaders in telangana

జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఈ రోజు ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపాయి. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా ఈ దాడులు సాగాయి. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులపై ఇటీవల ఆదాయపన్ను శాఖ నజర్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా ఐటీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు.

it raids on congress leaders in telangana

రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు ఐటీ అధికారులు దాడులు చేశారు. మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో పాటు శంషాబాద్ బహదూర్ గూడలోని కేఎల్ఆర్ ఫామ్ హౌస్ తో పాటు ఆయన నివాసం, సికింద్రబాద్ లోని కేఎల్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కార్పొరేట్ కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు.

మరో వైపు బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆమె భర్త నర్సింహా రెడ్డికి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్స్, పెద్ద సంఖ్యలో వైన్స్ వ్యాపారాలు వున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అత్యంత నమ్మకస్తునిగా ఉన్నారు. ఇటీవల సబితా ఇంద్రారెడ్డితో విభేదాల నేపథ్యంలో నర్సింహా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మహేశ్వరం టికెట్ కోసం లాబీయింగ్ కూడా చేశారు.

ఇది ఇలా వుంటే బాలాపూర్ గణేశ్ లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి నివాసంపై ఐటీ దాడులు చేసింది. అటు నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. మొత్దం 14 ప్రాంతాల్లో 32 మంది ఐటీ అధికారుల బృందం దాడులు చేసింది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో కేఎల్ఆర్ ఫాం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేఎల్అర్‌ను బయటికి పంపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

You may also like

Leave a Comment