భాగ్యనగరంలో ఐటీ రెయిడ్స్ (IT Raids) కామన్ గా మారిపోయింది.. ఎన్నికల ముందు కూడా పలు చోట్ల భారీగా ఐటీ రెయిడ్స్ జరిగిన విషయం తెలిసిందే.. కాగా మరోసారి ఫార్మా కంపెనీలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతోన్నారు.. ఈ రోజు ఉదయం రాయదుర్గం (Raydurgam).. కోకాపేట (Kokapet).. మొయినాబాద్ (Moinabad)లో ఉన్న ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుపుతోంది.
మొత్తం తొమ్మిది చోట్ల ఐటీ తనిఖీలు చేస్తోంది. మోయీనాబాద్లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళల్లో, అలాగే శ్రీ హరి హోమ్స్ రవీంద్ర అగర్వాల్, చందర్ రాజ రెడ్డి, ప్రకాష్ రెడ్డి నివాసంలో ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారు జామునుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం..
కోకాపేట్, రాయదుర్గం, మొయినాబాద్ లతో పాటుగా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో ఫార్మా కంపెనీపై రెయిడ్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.. ఈ మధ్యకాలంలో రాజకీయ నేతలతో పాటుగా పలు కంపెనీలపై ఐటీ రెయిడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఎన్నికలకు ముందు సైతం పలువురు కాంగ్రెస్ నేతలపై రెయిడ్స్ జరిగాయి..