రంగారెడ్డి జిల్లా(Rangareddy dist) మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డి(Kichannagar Laxmareddy) ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారులు(IT officers) సోదాలు చేపట్టారు. జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్(Form house)పై ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ సోదాలు చేస్తున్నారు.
ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది కేఎల్ఆర్ ఇంట్లోకి ఎవరినీ అనుమతించడంలేదు. విషయం తెలుసుకున్న లక్ష్మారెడ్డి అనుచరులు, కార్యకర్తలు భారీగా ఇంటివద్దకు చేరుకుంటున్నారు. అదేవిధంగా బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ ఆశావహురాలు, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాతానర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కాగా హైదరాబాద్ బాలానగర్ ఏసీపీ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి పత్రాలులేని రూ. 1లక్ష 50వేల నగదును జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. అలాగే బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గిరినగర్‌లో ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లక్ష రూపాయల నగదును సీజ్ చేశారు. మరోవైపు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని రూ.21లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.