Telugu News » Jagga Reddy: ఓట్ల సునామీ వస్తుంది.. కాంగ్రెస్‌కు 70సీట్లు పక్కా: జగ్గారెడ్డి

Jagga Reddy: ఓట్ల సునామీ వస్తుంది.. కాంగ్రెస్‌కు 70సీట్లు పక్కా: జగ్గారెడ్డి

కేఎల్ఆర్ దగ్గర ఏముందని ఐటీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా మీద ఐటీ దాడులు చేస్తే అప్పులు లెక్కగట్టి.. వాళ్లే ఇచ్చి పోవాలి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

by Mano
Jagga Reddy: Tsunami of votes will come.. 70 seats for Congress: Jagga Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70సీట్లు పక్కా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy( ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయడంపై మండిపడ్డారు. కేఎల్ఆర్ దగ్గర ఏముందని ఐటీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా మీద ఐటీ దాడులు చేస్తే అప్పులు లెక్కగట్టి.. వాళ్లే ఇచ్చి పోవాలి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Jagga Reddy: Tsunami of votes will come.. 70 seats for Congress: Jagga Reddy

ఈ సారి ఎన్నికల్లో సునామీ వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్.. కొడంగల్..కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని… తనను కూడా ఎక్కడైనా పోటీ చెయ్.. అంటే పోటీకి నేను సిద్ధం అంటూ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి భయపడే వాడా..? హరీశ్‌ వంద పంచులు వేసినా తాను పంచులు వేస్తే ఒక్కటే చాలన్నారు. సంగారెడ్డిలో పేదలకు 100 గజాలు స్థలం ఇంటి జాగా ఇవ్వాలని తన కోరిక అని చెప్పారు. రైతులకు డబ్బులు ఇచ్చి 2000 ఎకరాలు తీసుకుని ఇంటిగా ఇస్తానని చెప్పారు.

సింగిల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు జగ్గారెడ్డి. ఎంఐఎం.. బీఆర్ఎస్ .. బీజేపీ ఒక్కటేనని, బీజేపీ ఆడుతున్న అటలో బీఆర్ఎస్, ఎంఐఎం పావులు అని ఆరోపించారు. బండి సంజయ్.. కవితను జైలుకు పంపిస్తానని చెప్పాడని.., కవిత అరెస్ట్ ఆగిపోగానే బీజేపీ వాళ్ళ ఆశలు గల్లంతు అయ్యాయని తెలిపారు. కిషన్‌రెడ్డి అయితే సైలెంట్‌గా ఉంటాడనే అధిష్టానం అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిందని తెలిపారు.

మైనార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా ఉండేందుకు ఎంఐఎం బీజేపీకి సైనికుడిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం 7 ఎమ్మెల్యేలను పాతబస్తీ లో ఓడించండి.. మీ బతుకులు మార్చేస్తుంది కాంగ్రెస్ ఉందన్నారు. కాంగ్రెస్ తరఫున మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా? అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని.. ప్రజలు డిసైడ్ అయ్యారని, సీక్రెట్.. సైలెంట్ ఓటింగ్ అవుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment