మాల్దీవుల అధ్యక్షుడు(President of the Maldives) మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizju) భారత్(Bharat)పై చేసిన వ్యాఖ్యలకు మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(External Affairs Minister S Jaishankar) చురకలు అంటించారు. ‘వై భారత్ మ్యాటర్స్'(Y Bharat Matters) అనే పుస్తకానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత నెలలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాట్లాడుతూ తమను వేధించేందుకు ఏ దేశానికీ లైసెన్స్ ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. ఇది దౌత్యపరంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగానే తాజాగా జైశంకర్ సరైన జావాబిచ్చారు. పొరుగు దేశాలు ఇబ్బందుల్లో ఉంటే భారత్ ఎంత చురుగ్గా సాయం అందిస్తుందో తెలిపారు. భారత్‌కు తన పొరుగు దేశాలతో ఉన్న సంబంధాల్లో చాలా మార్పు వచ్చిందన్నారు.
ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను విపరీతంగా వేధించేవాళ్లు 4.5 బిలియన్ డాలర్ల సాయం చేయరని తెలిపారు. కొవిడ్ సమయంలో అలాంటి వారు వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఇవ్వరని, యుద్ధాల కారణంగా వారి జీవితాలు ఇబ్బందుల్లో ఉంటే.. సొంత నిబంధనలకు మినహాయింపులు ఇచ్చుకొని ఇంధనం, ఎరువులు, ఆహారం అందించామని చెప్పుకొచ్చారు.
భారత్‌కు పొరుగు దేశాలతో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయని జైశంకర్ వెల్లడించారు. భారత్‌కు బంగ్లాదేశ్, నేపాల్‌తో మంచి సంబంధాలున్నాయన్నారు. ప్రస్తుతం ఈ దేశాలతో పవర్ గ్రిడ్, రోడ్లు ఏర్పడ్డాయని పదేళ్ల కిందట ఇవేవీ లేవని గుర్తు చేశారు. జలమార్గాలను కూడా వాడుతున్నామన్నారు. ప్రస్తుతం భారత్ వాణిజ్య సంస్థలు బంగ్లాదేశ్ పోర్టులనూ వినియోగిస్తున్నాయని చెప్పారు.