Telugu News » Lok Sabha Elections : రంగంలోకి దిగుతున్న కేసీఆర్.. ఎంపీ ఎన్నికల ప్రచారానికి సిద్దమైన రోడ్ మ్యాప్..!

Lok Sabha Elections : రంగంలోకి దిగుతున్న కేసీఆర్.. ఎంపీ ఎన్నికల ప్రచారానికి సిద్దమైన రోడ్ మ్యాప్..!

కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ సిద్ధం అయ్యింది. బీఆర్ఎస్‌కు అచ్చొచ్చే కరీంనగర్‌లో ఈ నెల 12న భారీ బహిరంగా సభతో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

by Venu
cm kcr public meeting in warangal and gajwel

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్.. ప్రస్తుతం జరగనున్న లోక్ సభ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందనే అనుమానాలను రేకెత్తించింది. ఇప్పటికే కారు దిగే నేతలతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా ఇంత వరకు కేసీఆర్ మౌనంగా ఉండటం నేతల్లో చర్చాంశనీయాంగా మారింది. మొత్తానికి అసంతృప్తులతో రగిలిపోతున్న బీఆర్ఎస్ భవిష్యత్తుపై రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొంది..

అయితే ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలను (Parliament Elections) గులాబీ ప్రతిష్టాత్మంగా తీసుకొందనే వార్త వినిపిస్తోంది. ఇందులో గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చర్చించుకొంటున్నారు.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి.. అంతలోనే గాయం కారణంగా కొన్నాళ్లు పాలిటిక్స్‌కు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ (KCR) .. పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో తిరిగి యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ (Telangana) భవన్‌లో నిన్న ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ (BRS) ఎన్నికల శంఖారావం పూరించనుంది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారని అనుకొంటున్నారు.

ఈ మేరకు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ సిద్ధం అయ్యింది. బీఆర్ఎస్‌కు అచ్చొచ్చే కరీంనగర్‌లో ఈ నెల 12న భారీ బహిరంగా సభతో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించేలా షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్లలో భారీ బహిరంగ సభలతో పాటు.. రోడ్ షోలు నిర్వహించే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం..

మరోవైపు ఎన్నిలా దృష్ట్యా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నేతలు ఇప్పటికే దూకుడు పెంచారు.. దీంతో రాష్ట్రంలో జరిగే త్రీముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే కనుమరగు అవుతుందనే అపవాదు మూటగట్టుకొన్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయని అనుకొంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరో సమరం సిద్దం అవుతోంది.

You may also like

Leave a Comment