Telugu News » Jana Reddy : ఆ ఒరవడితో రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది… జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…!

Jana Reddy : ఆ ఒరవడితో రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది… జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ఈ ప్రభుత్వం రాత్రింబవళ్లు కసరత్తులు చేస్తోందని తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.

by Ramu
Jana reddy interesting comments on revanth month long rule

రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంపై మాజీ మంత్రి జానారెడ్డి (Jana Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ఒరవడితో ముందుకు వెళుతోందని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ఈ ప్రభుత్వం రాత్రింబవళ్లు కసరత్తులు చేస్తోందని తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.

Jana reddy interesting comments on revanth month long rule

రేవంత్ నెల రోజుల పాలన చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన కల్పిస్తోందని చెప్పారు. గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలను అధిగమించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. మేదావులు, ప్రజాసంఘాల, పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచనలు చేశారు.

ఈ ప్రజా పాలనలో తన వంతు పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు. గతంలో తాను నాయకత్వం వహించినప్పటికీ.. ఇప్పుడు పార్టీ కార్యకర్తగా పనిచేస్తానన్నారు. తన పనితీరు ప్రతి కార్యకర్తకూ ఆదర్శంగా ఉండేలా పనిచేస్తానని, తన అనుభాన్ని, సలహాలను ప్రభుత్వానికీ, ప్రజలకు ఇచ్చేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త చేసిన కృషి అద్వితీయం. కాంగ్రెస్‌ను గెలిపించి.. ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా .. ఇదే స్పూర్తితో పనిచేయాలి. అత్యధిక స్థానాలు గెలిచి సోనియా గాంధీ కి కానుకగా ఇద్దాం’అని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను పదేళ్ల కింద చెప్పినవే ఇప్పుడు నిజమయ్యాయన్నారు. అప్పులు, హామీలు,, సంస్కారం, ప్రజాస్వామ్యం, పతకాలపై గత ప్రభుత్వాన్ని .. తాను అనాడే హెచ్చరించానని చెప్పారు. అప్పులు, విద్యుత్ కొను గోళ్ళు భవిష్యత్‌కు చాలా ప్రమాదమని తాను హెచ్చరించానని, ఇప్పుడు అదే నిజమైందన్నారు.

 

You may also like

Leave a Comment