Telugu News » Mla Pocharam Srinivas Reddy: బీఆర్ఎస్‌ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం: మాజీ స్పీకర్

Mla Pocharam Srinivas Reddy: బీఆర్ఎస్‌ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం: మాజీ స్పీకర్

అసెంబ్లీలో 39మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదని, తమకు మరో 25మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు ఉన్నారని చెప్పుకొచ్చారు.

by Mano
Mla Pocharam Srinivas Reddy: Don't belittle BRS: Ex-Speaker

అసెంబ్లీలో బీఆర్ఎస్‌(BRS)ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోమని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS Mla) పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Mla Pocharam Srinivas Reddy: Don't belittle BRS: Ex-Speaker

మర్యాదగా ప్రవర్తిస్తే తామూ మర్యాదగానే ఉంటామని, లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో 39మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదని, తమకు మరో 25మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు ఉన్నారని చెప్పుకొచ్చారు. తక్కువ మెజార్టీతో 14మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారని.. లేదంటే బీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చేదని చెప్పుకొచ్చారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయడానికే ప్రభుత్వం కింద మీద పడుతోందని ఎద్దేవా పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేశారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క డబ్బులు జమ చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అయినా డబ్బులేమైనా ప్రింటింగ్ చేస్తారా? వచ్చిన ఆదాయాన్నే పంచాలని వివరించారు.

ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయినా కాంగ్రెస్‌వి 420 హామీలని హేళన చేశారు. తాము 10ఏళ్లు పరిపాలించామని, కానీ రెండు నెలలకే ఇంత దౌర్జన్యం చేయలేదని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment