Telugu News » Janasena: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ… పొత్తుల విషయం క్లారిటీ వచ్చి నట్టేనా….!

Janasena: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ… పొత్తుల విషయం క్లారిటీ వచ్చి నట్టేనా….!

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే అంశంపై చర్చించేందుకు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం అయ్యారు.

by Ramu

తెలంగాణ ఎన్నికల రాజకీయం మరో కీలక మలుపు తిరగబోతోంది. తాజాగా తెలంగాణలో జనసేన (Janasena)తో పొత్తుకు బీజేపీ (BJP) రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే అంశంపై చర్చించేందుకు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం అయ్యారు.

ఇన్నాళ్లు ఎవరి దారి వారిదే అన్నట్టు ఇరు పార్టీలు వ్యవహరించాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇరు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుండటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. పొత్తు కుదిరితే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అంశాలపై జోరుగా చర్చ నడుస్తోంది.

సీట్ల విషయంపై చర్చించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. తెలంగాణలో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు అంశంపై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం.

ఇది ఇలా వుంటే తెలంగాణలో మొత్తం 32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కనీసం 20 సీట్లు తమకు కేటాయించాలని బీజేపీని జనసేన కోరుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంలో అమిత్ షాతో భేటీలో చర్చించినట్టు సమాచారం.

You may also like

Leave a Comment