Telugu News » Pavan Kalyan : మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… సీఎంను….!

Pavan Kalyan : మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… సీఎంను….!

ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇంట్లో ఆడవాళ్లపై విమర్శలు చేయలేదన్నారు. ఇళ్లలో ఉండే మహిళా కుటుంబ సభ్యులను నీచంగా విమర్శించే సంస్కృతిని వైసీపీ ప్రారంభించిందన్నారు.

by Ramu

ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్ కు విలువ తెలియదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదైనా అంటే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం ఆయనకు అలవాటని మండిపడ్డారు. ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇంట్లో ఆడవాళ్లపై విమర్శలు చేయలేదన్నారు. ఇళ్లలో ఉండే మహిళా కుటుంబ సభ్యులను నీచంగా విమర్శించే సంస్కృతిని వైసీపీ ప్రారంభించిందన్నారు. ఇంట్లో తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి మన ఇంట్లో మహిళకు ఏం విలువ ఇస్తాడంటూ మండిపడ్డారు.

Janasena Chief Pavan Kalyan Fire on Cm Jagan

యువ గళం… నవశకం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. లోకేశ్ చేసిన పాదయాత్ర జగన్ చేసిన పాదయాత్ర లాంటిది కాదన్నారు. ఇది కన్నీళ్లు తెలుసుకున్న పాదయాత్ర అని తెలిపారు. ఇది మాటల పాదయాత్ర కాదని చేతల యాత్ర అని పేర్కొన్నారు. అలాంటి పాదయాత్ర చేసిన టీడీపీ నేత నారా లోకేశ్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్ర చేస్తే తనకు అసూయ ఉంటుందన్నారు. తాను పాదయాత్ర చేద్దామంటే నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు.

పాదయాత్రతో చాలా అనుభవాలు ఎదురవుతాయన్నారు. చాలా మందితో సాదక బాధలు తెలుసుకోవచ్చని, వారి కష్టాలను పంచుకోవచ్చన్నారు. అలాంటి అవకాశం తనక లేనందుకు చాలా బాధగా ఉందన్నారు. తనకు దొరకని అవకాశం నారా లోకేశ్ కు దొరకడం, దాన్ని ఆయన దిగ్విజయంగా పూర్తి చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.

ఏపీ స్ఫూర్తి దేశానికి చాలా కీలకమన్నారు. దేశానికే స్ఫూర్తినిచ్చిన నేల ఇదన్నారు. గతంలో ఏపీ అనేది మోడల్ స్టేట్ అని, అక్కడకు వెళ్లాలని ఐఏఎస్ లు అనే వారన్నారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. చంద్రబాబును జైళ్లో పెట్టినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. కష్టాలను చిన్నప్పటి నుంచి తాను దగ్గరగా చూశానన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నానన్నారు.

మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ఉండాలని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలులో వారితో మాట్లాడనన్నారు. కాంగ్రెస్ నేతలు చేసిన తప్నుకు జగన్ ను సోనియా గాంధీ జైల్లో పెట్టారన్నారు. రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా రాష్ట్ర విభజన జరిగిన కష్ట సమయంలో తాను పోటీని విరమించుకుని మరి టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చానన్నారు.

ఆ తర్వాత తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిందన్నారు. కానీ దురదృష్టవశాత్తు భేదాభిప్రాయాలు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తమ బంధాన్ని ముందుకు తీసుకు వెళ్లలేకపోయామన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ ఏర్పడిందన్నారు. 2024లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామన్నారు. మార్పు తీసుకు రాబోతున్నామన్నారు. జగన్ ను ఇంటికి పంపించబోతున్నామన్నారు.

పాతిక మంది ఎమ్మెల్యేలను మార్చారన్నారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్ నన్నారు. ప్రభుత్వాన్ని సమర్థవంతగా నడిపి ప్రజలకు మేలు చేయాల్సిన వక్తి కూల్చి వేతలతో మొదలు పెట్టారన్నారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవిధంగా, ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఈ సీఎం కక్ష సాధించే వ్యక్తి అని మండిపడ్దారు.

30వేల మంది అదృశ్యం అయితే అలాంటి వ్యక్తి ఏం పట్టించుకుంటాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్ర ప్రారంభిస్తే తనపై దాడులు జరిగాయన్నారు. మరోసారి వైసీపీ సర్కార్ వస్తే ప్రజలు ఇళ్లలో ఉండే పరిస్థితి ఉండదన్నారు. ఏపీ పరిస్థితులను బీజేపీ జాతీయ నాయకులకు తాను వివరించానన్నారు. మన భవిష్యత్ కోసం మనమే కాట్లాడాలన్నారు. ఏపీ భవిష్యత్ నిలదొక్కుకునేంత వరకు టీడీపీ జనసేన పొత్తు ఉండాలన్నారు.

You may also like

Leave a Comment