అసెంబ్లీ ఎన్నికలలో (Assembly elections) ఎలాగైనా గెలవాలనే ఆశతో నేతలు కొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభపెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇలాంటి సంఘటన నగరంలో జరిగింది. మేడ్చల్ (Medchal) జిల్లా జవహర్ నగర్ (Jawahar Nagar) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే..
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)లో భారీగా నగదు పంపిణీ జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమేరకు పార్టీ లీడర్లు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ దొరికిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మోహన్ రావు నగర్ కాలనీలో ఇంటింటికి డబ్బులు పంపిణీ చేస్తూ కొందరు దొరికారు.. వీరంతా మల్లారెడ్డి కాలేజ్ సిబ్బందని ప్రచారం జరుగుతుంది.
మోహన్ రావు నగర్ కాలనీలో ఇంటింటికి డబ్బులు పంచుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు వారిని రెడ్ హ్యాండ్ గా పట్టుకోగా.. అదే పార్టీకి చెందిన మహిళలు వారిపై దాడికి దిగినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ తతంగం వెనక మంత్రి మల్లారెడ్డి ఉన్నట్టు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. తన అనుచరులతో డబ్బులు పంపిణీ చేపిస్తున్నట్లు ఆరోపించారు..
ఓడిపోతాననే భయంతో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.. తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నానని మంత్రి మల్లారెడ్డి మాటలు చెప్పడమే జరుగుతుంది కానీ చేసిన పనులు మాత్రం లేవని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఎవరు డబ్బులు పంచించినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తులను జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు కాంగ్రెస్ నాయకులు..