Telugu News » Jharkhand: చెట్టు నరికే విషయంలో గొడవ.. ముగ్గురి దారుణ హత్య..!

Jharkhand: చెట్టు నరికే విషయంలో గొడవ.. ముగ్గురి దారుణ హత్య..!

చెట్టును నరికివేసే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్‌(Jharkhand)లోని గుమ్లా జిల్లా(Gumla District) పోట్రోసక్రౌలీ(Potrosacrouly) గ్రామంలో చోటుచేసుకుంది.

by Mano
Jharkhand: Clash over tree felling.. Three people brutally murdered..!

చెట్టును కొడుకుతో సమానమని చెబుతుంటారు పెద్దలు. అయితే ఓ చోట మాత్రం చెట్టు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. చెట్టును నరికివేసే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటన ఝార్ఖండ్‌(Jharkhand)లోని గుమ్లా జిల్లా(Gumla District) పోట్రోసక్రౌలీ(Potrosacrouly) గ్రామంలో చోటుచేసుకుంది.

Jharkhand: Clash over tree felling.. Three people brutally murdered..!

ఇక్కడ ఓ వర్గానికి చెందిన నాగేశ్వర్ సాహు, సత్యేంద్ర సాహు, శివకుమార్ సాహు అనే ముగ్గురు గ్రామస్తులు భూ వివాదం, వివాదాస్పద స్థలంలో చెట్లను నరికివేసినందుకు గొడ్డలితో వచ్చారు. మరో వర్గంతో పరస్పర దాడులకు దిగారు. ఈ క్రమంలో మరో వర్గానికి చెందిన మున్నా సాహు, నాగేశ్వర్ సాహు, పవన్ సాహు నమక్‌ల ఒకరి తర్వాత ఒకరు తీవ్రంగా గాయపడి మృతిచెందారు.

మృతుడు మున్నా సాహు కుమారుడు వికాస్ సాహు తీవ్రంగా గాయపడగా అతన్ని చికిత్స కోసం గుమ్లా జిల్లా నుంచి రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యానంతరం పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా పోలీసులు క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. హత్యతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment