Telugu News » Revanth Reddy : జగన్-కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : జగన్-కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి..!

గత ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబునాయుడును ఓడించి, తన మిత్రుడైన జగన్‌ను గద్దెనెక్కించేందుకు కేసీఆర్ సహకరించారు. చంద్రబాబుకు రిటన్‌ గిఫ్ట్ ఇస్తానని మీడియా సమక్షంలోనే కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు..

by Venu
jagan-and-kcr

చెడపకురా చెడేవు అనే సామెత ప్రస్తుతం రాజకీయాల్లో ప్రాక్టికల్ గా అమలవుతుందని అంటున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలున్న నేపథ్యంలో వైసీపీకి షాక్ ఇచ్చేలా టీడీపీకి మేలు జరిగేలా తెలంగాణ నుంచి ప్రణాళికలు అమలవుతున్నాయని అనుకొంటున్నారు. దీనికి కారణం గత ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. జగన్ విజయం కోసం ఏం చేశారో.. దాదాపుగా అదే సీన్ ఇప్పుడు రివర్స్ లో చేయడానికి రేవంత్ రెడీ అయిపోయారనే టాక్ వినిపిస్తోంది.

వీటిని చదవండి : రచ్చకెక్కిన వ్యాపార భాగస్వాముల గొడవ.. లెక్కలు అడిగాడని..!!

CM Revanth Reddy key announcement on police recruitment

ఈమేరకు సీఎం జగన్ (CM Jagan)కు, రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారని అంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ (Congress) కు ఊపిరి పోసేందుకు, వైఎస్ బిడ్డ షర్మిలకు (Sharmila) ఏపీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం.. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతల ఆస్తుల మూలాలు ఉన్న తెలంగాణ (Telangana)పై దృష్టి సారించిందని తెలుస్తోంది.

వీటిని చదవండి: ప్రధాని మోడీతో ముగిసిన సమావేశం.. సీఎం జగన్‌ చర్చించిన అంశాలివే..!

మరోవైపు గత ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబునాయుడును ఓడించి, తన మిత్రుడైన జగన్‌ను గద్దెనెక్కించేందుకు కేసీఆర్ సహకరించారు. చంద్రబాబుకు రిటన్‌ గిఫ్ట్ ఇస్తానని మీడియా సమక్షంలోనే కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు.. అన్నట్లుగానే హైదరాబాద్ లో ఉన్న టీడీపీ నేతల ఆస్తుల విషయంలో వారికి మూడు చెరువుల నీళ్ళు తాగించారని ప్రచారం జరిగింది. అలా నాటి కేసీఆర్ సర్కారు టార్చర్ తట్టుకోలేక చాలా మంది నేతలు బీఆర్ఎస్ పంచన చేరిపోయారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి మారుతూ ఇక్కడ ఆస్తులు ఉన్నాయి అందుకే పార్టీ మారక తప్పడం లేదు అని బాహాటంగానే చెప్పేశారు.

అంటే వారిని లొంగదీసుకోవడానికి వారి భూములకు రెవిన్యూ శాఖ నోటీసులు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న బెదరింపులు, కోర్టులో కేసులు.. ఇలాంటి చర్యలతో భయపడిన చాలామంది నేతలు, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు కూడా వెనక్కు తగ్గిన పరిస్థితి నాడు నెలకొంది. అలా తెలుగుదేశం కు హైదరాబాద్ నుంచి నయాపైసా నిధులు అందకుండా కేసీఆర్ సర్కారు చాలా కట్టుదిట్టం చేసిందని, ఫలితంగా తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందనే టాక్ జోరుగా వినిపించింది.

సరిగ్గా అదే వ్యూహం సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు వైసీపీకి నిధులు అందే మార్గాలను మూసివేసే ప్రణాళిక ఇప్పటికే ఆరంభమైందని అంటున్నారు. కాళేశ్వరం సహా తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు నిలిపివేయాలని రేవంత్ సర్కారు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. వీటిలో ఏపీకి చెంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కంపెనీల బిల్లులు కూడా ఉన్నాయంటున్నారు.

అదీగాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను గెలిపించడానికి జగన్ సర్కార్ గట్టి ప్లాన్ వేసి జలవివాదాన్ని తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ అంతిమ విజయం కాంగ్రెస్ ను వరించింది. ఇలా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అంతానికి కలిసి పనిచేసిన జగన్, కేసీఆర్ రుణం తీర్చుకొని, జన్మలో మరచిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రేవంత్ సిద్దం అయినట్లు సామాజిక మాధ్యమంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

వీటిని చదవండి: ఊహించని మలుపులతో శివ బాలకృష్ణ కేసు.. బెయిల్ పిటిషన్ వాయిదా..!

You may also like

Leave a Comment