Telugu News » Jitender Reddy : రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత.. సీఎంతో చర్చలు..!

Jitender Reddy : రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత.. సీఎంతో చర్చలు..!

ఈ పొలిటికల్ మ్యాటర్ తెలిస్తే బీజేపీ (BJP) జితేందర్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా? లేక జితేందర్ రెడ్డి పార్టీ మారతారా ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

by Venu

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణ (Telangana) రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. పోటీలో చోటు దక్కక చిన్నబుచ్చుకొంటున్న వారికి గాలం వేయడానికి పార్టీలు సిద్దంగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొన్న మూడు ప్రధాన పార్టీలు.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

బీఆర్ఎస్ (BRS) తరపున 2018 ఎన్నికలలో టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి.. నిరాశ మిగలడంతో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో అధిష్టానం ఈసారి తనకు తప్పని సరిగా టికెట్ ఇస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. అదీగాక ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులతో సత్సంబంధాలు ఉన్న కారణంగా చివరిదాకా ప్రయత్నించారు. కానీ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు టికెట్ రావడంతో తీవ్ర నిరాశ గురయ్యారు.

ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం మధ్యాహ్నం జితేందర్ ఇంటికి వెళ్లారు. అయితే ఈ అంశం ప్రస్తుతం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. స్వయంగా సీఎం.. జితేందర్ రెడ్డి (Jitender Reddy) ఇంటికి వెళ్లి చర్చలు జరపడం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని, వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం, జితేందర్ కి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఈ పొలిటికల్ మ్యాటర్ తెలిస్తే బీజేపీ (BJP) జితేందర్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా? లేక జితేందర్ రెడ్డి పార్టీ మారతారా ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో భారీగా టార్గెట్ పెట్టుకొని బీజేపీ పావులు కదుపుతుండగా.. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత తరుణంలో జితేందర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

You may also like

Leave a Comment