కాంగ్రెస్ (Congress) పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Kamatareddy venkata reddy) సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta balakrishna reddy) హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో కండువా కప్పి కోమటిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మనస్ఫూర్తిగా జిట్టాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెంటన నడిచిన కొద్ది మంది నేతల్లో జిట్టా ఒకరని కోమటిరెడ్డి వెల్లడించారు. జిట్టా చేరికతో భువనగిరిలో పార్టీకి మరింత బలం పెరిగిందని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.సెప్టెంబర్ 17న తుక్కుగుడా సభకు 10 లక్షలకు పైగా జనం వస్తారని కోమటిరెడ్డి చెప్పారు.
తెలంగాణ కోసం పదవులను త్యాగం చేశానన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేచడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. కేసీఆర్ దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ లాగా మాయమాటలు చెబితే తాము 2014లొనే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల తుకులు మారలేదన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ ను బొందపెట్టాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పనిచేస్తామన్నారు.