Telugu News » Joe Biden: ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నాం.. ఇరాన్‌కు బైడెన్ వార్నింగ్..!

Joe Biden: ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నాం.. ఇరాన్‌కు బైడెన్ వార్నింగ్..!

ఇజ్రాయెల్‌‌‌పై దాడి కోసం ఇరాన్ 100 క్రూయిజ్ మిసైల్స్‌ను సిద్ధం చేసుకుందని, ఇజ్రాయెల్ సైనిక స్థావారాలపై డ్రోన్ దాడులు జరపొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయని అమెరికా వర్గాలు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

by Mano
Joe Biden: We are committed to Israel's security.. Biden's warning to Iran..!

ఇజ్రాయెల్‌(Israel)పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తలు సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్‌‌‌పై దాడి కోసం ఇరాన్ 100 క్రూయిజ్ మిసైల్స్‌ను సిద్ధం చేసుకుందని, ఇజ్రాయెల్ సైనిక స్థావారాలపై డ్రోన్ దాడులు జరపొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయని అమెరికా వర్గాలు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

Joe Biden: We are committed to Israel's security.. Biden's warning to Iran..!

 

ఇజ్రాయెల్‌ నేరుగా దాడులకు దిగడంతో పాటూ ఇతరులతో కూడా దాడులు చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, దాడి ఆలోచనలను ఇరాన్ పక్కన పెట్టాలని సూచించారు. దాడులకు దిగితే ఊరుకోమని ఇరాన్‌(Iran)కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడుల నుంచి తనని తాను కాపాడుకోవడం ఇజ్రాయెల్‌కు సవాలేనని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఉద్రిక్తతలు ముదరకుండా ఉండేందుకు ఇరాన్ స్వల్ప స్థాయి దాడులు చేసే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా సైనిక ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ సైన్యాధికారులతో సమావేశమై దాడులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లపై చర్చించారు.

అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం ఉందని జో బైడెన్ అంగీకరించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని.. స్వీయరక్షణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ విజయం సాధించలేదని బైడెన్ వ్యాఖ్యానించారు.

అటు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు అమెరికా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో రెండు యుద్ధ నౌకలను మోహరించింది. వీటిల్లో అత్యాధునిక ఏజిల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్‌కు వెళ్లొద్దంటూ భారత్ సహా అనేక దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఇరాన్‌కు విమానసేవలను నిలిపివేసింది.

You may also like

Leave a Comment