ఏపీలో ఎన్నికలకు(AP Elections) సమయం దగ్గర పడుతుండడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పుల నేపథ్యంలో నేతలు ఇంకా ఇతర పార్టీల వైపు చూస్తూ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో పెడన అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) పెనమలూరు(Penamaluru)కు వైసీపీ మార్చింది. దీంతో.. పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీ వార్(Political Flexi War) నడుస్తోంది. జోగి రమేష్‌పై కుట్ర చేసి గెలవలేని నియోజకవర్గం సీట్ ఇచ్చారని భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
నేడు మంత్రి జోగి రమేష్ జన్మదిన సందర్భంగా పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయనకు తొలి విజిట్ టెన్షన్ పట్టుకుంది. జోగి రమేష్.. నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. జోగి ఇన్చార్జి అవగానే దళిత అధికారును వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసింది.
అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్ తొలి పర్యటన ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ సీటు తమకే కేటాయించాలని కంకిపాడుకు చెందిన పడమట సురేష్ బాబు, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్‌లు ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కంకిపాడు బస్టాండు ఆవరణలో కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇక్కడ ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తికి ఎలా కేటాయిస్తారు? అంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. మరోవైపు, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.