Telugu News » Telangana : బీఆర్ఎస్‌ కు మొదలైన కొత్త టెన్షన్.. అదే సీన్ రిపీట్ అవుతుందా..!?

Telangana : బీఆర్ఎస్‌ కు మొదలైన కొత్త టెన్షన్.. అదే సీన్ రిపీట్ అవుతుందా..!?

అధికారంలో ఏ పార్టీ ఉంటే, నేతలు ఆపార్టీ వైపు మొగ్గుచూపడం కామన్ గా జరిగేదే.. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

by Venu
congress-leaders-are-criticizing-brs-leaders

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS)పై చర్చ జోరుగా సాగుతోంది. ఒక తుఫాన్ లా వచ్చి మొదటి ఐదు సంవత్సరాలు నమ్మకంతో, తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజల్లోకి వెళ్ళి విజయవంతంగా పాలన ముగించింది. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లలో అదే సెంటిమెంట్, అయింట్ మెంట్ లా పూసి రెండో సారి సైతం అధికార పగ్గాలు చేపట్టింది. మొత్తానికి ప్రజలు నమ్మారని భావించి.. పాలనలో అహంకార ధోరణి ప్రదర్శించడంతో మూడోసారి మూలాన కూర్చోబెట్టారనే టాక్ నడుస్తోంది.

స్వేచ్ఛగా బ్రతకడం కోసం తెచ్చుకొన్న తెలంగాణలో.. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసే సరికి కారు గ్యారేజీకి వెళ్ళే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టాక్ మొదలైంది. ఇంతలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) తెర మీదికి వచ్చాయి.. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల సహకారంపై గులాబీ నేతల్లో భయం పట్టుకొన్నదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించకపోవడంతోనే ఓటమి ఎదురైందని, లోక్ సభ ఎన్నికల్లోనైనా వారి సహకారం ఉంటుందా అనే అనుమానాలు పార్టీ వర్గాలలో మొదలైనట్టు సమాచారం..

ఇప్పటికే మున్సిపల్ లీడర్లు చేజారుతుండటం, గ్రామస్థాయి కార్యకర్తలు సైతం కాంగ్రెస్‌ (Congress)లో చేరుతుండటంపై రాష్ట్ర నాయకత్వం ఆందోళనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. పార్టీ కేడర్, లీడర్‌కు మధ్య గ్యాప్ ఏర్పడటంతో.. కేడర్‌ను ఎలా గాడిలో పెట్టాలో తెలియక పార్టీ అధినాయకత్వంతో పాటు లోక్ సభ సెగ్మెంట్ ఇన్ ఛార్జీలు సైతం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచి మున్సిపల్, కార్పొరేషన్ పదవుల్లో మెజార్టీ గులాబీవైపే ఉన్నప్పటికి.. అసెంబ్లీలో పరాజయం ఎదురైంది.

మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనే భయం పార్టీ నాయకత్వంలో మొదలైనట్టు సమాచారం.. అదీగాక అధికారంలో ఏ పార్టీ ఉంటే, నేతలు ఆపార్టీ వైపు మొగ్గుచూపడం కామన్ గా జరిగేదే.. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈమేరకు గ్రామస్థాయి నుంచి కేడర్ సహకరించకపోతే బీఆర్ఎస్ ఉనికి ఏమవుతుంది? ఎన్నిసీట్లు గెలుస్తాం? తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నలా మిగిలింది..

You may also like

Leave a Comment