బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన వైఫ్యల్యాలు, అవినీతిపై కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తీవ్ర ఆరోపణలు చేశారు.. కేసీఆర్ (KCR) చవట దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని 8లక్షల కోట్ల అప్పుల పాలు చెయ్యలేదా? అని మండిపడ్డారు. సొంత ప్రాంతీయడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే ఆ ప్రాంతంలోనే పాతి పెట్టాలనే సామెత ప్రకారం ఆయనను ఇక్కడే బొంద పెట్టాలని మండిపడ్డారు..
కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పంట నష్టం ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించిన జూపల్లి.. ఫామ్ హౌస్ లో పండి ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు.. నాలుగు మాసాల కాంగ్రెస్ పాలనను చూసి ఉలిక్కిపడి.. మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని పెద్దమనిషి.. దమ్ముంటే మేడి గడ్డకి కాదు పాలమూరుకు పోదామా? అని సవాల్ విసిరారు.. మిషన్ భగీరథ లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు..
అదేవిధంగా సీఎం రేవంత్ 12సార్లు ఢిల్లీ పోయినా సోనియా, ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారు… కానీ కేసీఆర్ హైదరాబాద్ (Hyderabad)లో ఉన్నా మంత్రులను కలవలేదని గుర్తు చేసిన జూపల్లి.. తలకిందులుగా తపస్సు చేసినా లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటి సీటు కూడా బీఆర్ఎస్ దక్కించుకోదని జోష్యం చెప్పారు. ఆయన వ్యవహారాలను దగ్గర ఉండి చూసిన వ్యక్తులుగా చెబుతున్నాం.. ప్రస్తుతం కేసీఆర్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు..
లోక్ సభ ఎన్నికల్లో BRS ఓడిపోతే పార్టీనే రద్దు చేసుకుంటా అని చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించిన జూపల్లి.. రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నాలుగు మాసాలు అయ్యింది.. కానీ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం న్యాయం చేశారో చర్చకు వస్తారా? అని డిమాండ్ చేశారు.. చవట, దద్దమ్మ, లఫుట్ మాటలు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఫామ్ హౌస్ లో పడుకొని, పదేళ్లు నచ్చినట్లు పాలన చేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని గద్దలెక్క దోచుకున్నారని జూపల్లి విమర్శించారు. కుర్చేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తాన్నన్న బుడబుక్కల మాటలు ఎక్కడపోయాయని ప్రశ్నించారు. తుమ్మిల్ల ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లు ఏమయ్యాయి.. ఏ ప్రాజెక్టు ఏ జాతికి అంకితం చేశావో వివరించని సవాల్ విసిరారు.. దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ దగ్గరకు రావడానికి సిద్దమా..? అన్నారు..
మిషన్ భగీరథ లో వేల కోట్ల అవినీతి జరిగిందన్నది సత్యమని తెలిపిన జూపల్లి.. సీఎం 12 సార్లు కాదు 30 సార్లు డిల్లీకి వెళ్తారు.. మీ కడుపు మంట ఏంటి..? అని ప్రశ్నించారు.. బుద్ది జ్ఞానం లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 49 వేల కోట్ల పెండింగ్ బిల్లుల అప్పు రూపంలో ఉందని తెలిపిన మంత్రి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని జోస్యం చెప్పారు.. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైందని ఎద్దేవా చేశారు..
కవిత ఉత్తిగనే జైలుకు పోయిందా..? అని ప్రశ్నించిన జూపల్లి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం కాకూడదని కేసీఆర్ తో నడిచినట్లు వెల్లడించారు. రాష్ట్రం లూటీ అవుతుంటే చూస్తూ ఉండలేక విభేదించి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటామని ప్రకటించే ధైర్యం.. దమ్ముందా..? ఉందా అని సవాల్ విసిరారు. అదే విధంగా గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆరోపించారు.
అలాగే నా ఫోన్ తో పాటు పొంగులేటి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని తెలిపిన జూపల్లి.. ఈ విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.. అదేవిధంగా నా ఫోన్ నా దగ్గరే ఉన్న పొంగులేటికి ఫోన్ ఎలా వెళ్లిందో.. ఈ విషయంలో మా దగ్గర ఎవిడెన్స్ లు ఉన్నట్లు పేర్కొన్నారు.. ఒక రాష్ట్రానికి పది సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఇంతలా దిగజారడం చరిత్రలో మొదటి సారి అని పేర్కొన్నారు.