Telugu News » Kadiyam Srihari : ఆరు గ్యారంటీలపై రభస.. సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి..!!

Kadiyam Srihari : ఆరు గ్యారంటీలపై రభస.. సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి..!!

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిన కడియం.. ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పదవి చేపట్టినాక మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచి సాకులు చెబుతోన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

by Venu
Kadiyam Srihari: As the lion takes two steps back.. Kadiyam Srihari's key comments..!

రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ ని కాదని.. కాంగ్రెస్ కి అధికార పట్టం కట్టారు.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పుల మీద చర్చించడం రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిందంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఈ అంశంపై హాట్ హాట్ గా చర్చలు సాగుతోన్న విషయం తెలిసిందే.. మరోవైపు బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కాంగ్రెస్‌ పై విమర్శలతో విరుచుకుపడ్డారు..

Kadiyam Srihari: As the lion takes two steps back.. Kadiyam Srihari's key comments..!

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిన కడియం.. ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పదవి చేపట్టినాక మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచి సాకులు చెబుతోన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభలో ప్రియంక గాంధీ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పిన విషయాన్ని కడియం గుర్తు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ (Congress) మేనిఫెస్టోలో కూడా దానిని పొందుపర్చారని తెలిపిన కడియం శ్రీహరి.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నిరుద్యోగ భృతి గురించిన హామీ తాము ఎక్కడా ఇవ్వలేదనడం సరికాదని హితవుపలికారు.. ఇక రైతులకు రూ.2 లక్షల పంట రుణాలను డిసెంబర్‌ 9న మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు ఎందుకు అమలుచేయడం లేదని కడియం ప్రశ్నించారు.

రైతులు పండించిన ధాన్యంకి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారని.. కానీ ఈరోజు వరకు ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలా లేదని కడియం శ్రీహరి వెల్లడించారు.. ఈ మూడు హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని కడియం మండిపడ్డారు.. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు తాము పూర్తిగా సహకరిస్తామని కడియం స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment