ఏపీ (AP)లో ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.. ఇప్పటికే దూకుడు మీదున్న జనసేన (Janasena), టీడీపీ (TDP), బీజేపీతో చేతులు కలిపి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూ ఊరుతోందని అనుకొంటున్నారు. ఈ క్రమంలో కాకినాడ (Kakinada) పార్లమెంట్ స్థానంపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. ఇక్కడి ఎంపీ (MP) సీటు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని వెల్లడించారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం తన కోసం త్యాగం చేసిన ఉదయ్‌కు, కాకినాడ ఎంపీ సీటు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు.. పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేస్తారా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని బీజేపీ తనను అడినట్లు తెలిపిన ఆయన.. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతానని తెలిపారు.
తనను ఓడించేందుకు పిఠాపురం (Pithapuram)లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించిన పవన్.. పిఠాపురం శక్తి పీఠం సాక్షిగా అడుగుతున్నా.. ఈ సారి నన్ను గెలిపించడని ఓటర్లను కోరారు. జనసేనను 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తనకు వచ్చిన స్థానాల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫిక్స్ చేసిన పవన్.. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. అయితే, జనసేనకు కేటాయించిన రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ (YCP) నుంచి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరికి మచిలీ పట్నం సీటు కేటా