తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగుబాటు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Projects) ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో పాటు ఇతర మంత్రులు గొప్పగా చెబుతూ వచ్చారు.
కానీ సరిగ్గా ఎన్నికలు జరగడానికి ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలైయ్యాయి.. కాగా ఈ అంశం కాంగెస్ కు అస్త్రంగా మారింది. దీంతో కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఏదో ఒకరూపంలో బీఆర్ఎస్ పై పడిన ఎఫెక్ట్, ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి దోహదపడింది.
అందులో ఈ ప్రాజెక్టు కుంగుబాటు అంశం కూడా ఓ కారణమైంది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ఎన్నికల ముందు చెప్పినట్లుగానే ఈ ప్రాజెక్టు అవినీతిపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విజిలెన్స్ నివేదికను రెడీ చేసింది. గత ప్రభుత్వం పేర్కొన్నట్లు.. వరదల కారణంగా ప్రాజెక్ట్ డ్యామేజ్ జరగలేదని, మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ అయినట్లు క్లారిటీకి వచ్చింది. స్టీల్, కాంక్రీట్ లో నాణ్యత లోపం ఉన్నట్లు విజిలెన్స్ తేల్చింది. మేడిగడ్డ నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది.
కాగా రెండు, మూడు రోజుల్లో మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టు విజిలెన్స్‌కు అందనున్నట్లు సమాచారం. మరోవైపు మేడిగడ్డ డ్యామేజ్ 2019లో జరిగినట్లు విజిలెన్స్ భావిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి వరదకే పగుళ్లు ఏర్పడ్డాయని అనుమానం వ్యక్తం చేసింది. అదీగాక ప్రాజెక్టుకు సంబంధించి రికార్డులు మాయం అయ్యాయని గుర్తించింది. త్వరలో పంప్ హౌస్ లపై విజిలెన్స్ విచారణ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.