Telugu News » Kaleswaram : కాళేశ్వరంపై మొదలైన జ్యుడీషియల్ ఎంక్వైరీ.. విచారణలో తెరపై ఏడు అంశాలు..!

Kaleswaram : కాళేశ్వరంపై మొదలైన జ్యుడీషియల్ ఎంక్వైరీ.. విచారణలో తెరపై ఏడు అంశాలు..!

ఈ నేపథ్యంలో నగరంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో విచారణ కమిటీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా విచారణ జరిపి, దోషులను గుర్తించి, జూన్‌ 30లోపు నివేదిక ఇవ్వాలని అధికారులు కోరనున్నట్లు తెలుస్తోంది.

by Venu
supreme-court-says-manipur-panels-report-shows-need-to-upgrade-compensation

బీఆర్ఎస్ (BRS) పతనానికి తొలి మెట్టుగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)పై జ్యుడీషియల్ ఎంక్వైరీ మొదలైంది. సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ విచారణ కమిషన్‌ తో ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అధికారుల బృందం నిన్న ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ క్రమంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుకు విడుదల చేసిన గెజిట్ ప్రతులను రాహుల్ బొజ్జ అందించారు.

Kaleswaram Project Defectsమరోవైపు ప్రభుత్వానికి ఘోష్ మిషన్ తొమ్మిది అంశాలతో వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది. ఈ క్రమంలో జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా వచ్చే వారంలో ఈ కమిషన్ బృందం హైదరాబాద్‌ (Hyderabad) కు రానుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి జ్యుడీషియల్‌ విచారణ కమిటీని కోరేందుకు సిద్దం అవుతుంది.

ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా నేతృత్వంలోని అధికారుల బృందం కోల్‌కతా (Kolkata)లో కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోషను కలవనుంది. ఇప్పటికే రాహుల్‌బొజ్జాతో పాటు ఈఎన్‌సీ బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ కె.శ్రీనివాస్‌ కోల్‌కతాకు చేరుకొన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో విచారణ కమిటీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా విచారణ జరిపి, దోషులను గుర్తించి, జూన్‌ 30లోపు నివేదిక ఇవ్వాలని అధికారులు కోరనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఏడు అంశాలేంటో గమనిస్తే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్‌, డిజైనింగ్‌లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ జరపాలని.. కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు.. అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన కారకులు ఎవరు.. మరోవైపు 3 బ్యారేజీల్లో ఆపరేషన్‌ మెయింటెన్స్‌లో నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు..

వీటితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు.. క్వాలిటీ కంట్రోల్‌, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలు.. నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు.. పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం విషయాలు..

అలాగే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తించాలి.. పైన కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గుతేల్చడం.. ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫారసు చేస్తే.. వాటిపై విచారణ చేయాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment