Telugu News » Telangana : కేసీఆర్ నేర్పిన పాఠాలే ఆయన పాలిట శాపంగా మారాయా.. ఓపెన్ సీక్రెట్ ఇదే..?

Telangana : కేసీఆర్ నేర్పిన పాఠాలే ఆయన పాలిట శాపంగా మారాయా.. ఓపెన్ సీక్రెట్ ఇదే..?

విక్టరీ గ్రౌండ్ కాంగ్రెస్ చేతిలో ఉండటంతో ఆ పార్టీకి ఆర్థిక వనరులు పరిపుష్టంగా అందుతాయనేది ఓపెన్ సీక్రెట్ అని తెలుస్తోంది. ఇలాంటి సమయాయంలో బీఆర్ఎస్ ను ఆర్థికంగా ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత కష్టం అయిన పనికాదు..

by Venu
KCR's politics around Annadata.. Will this strategy work?

చెడపకురా చెడేవు అనే సామెత ఉందన్న విషయం తెలిసిందే. ఏదైనా పనిచేసే ముందు న్యాయంగా ఆ పనిని పూర్తి చేయాలి.. కానీ అడ్డదారుల్లో విజయాన్ని సాధిద్దామని భావిస్తే.. అది శాశ్వతం కాదని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని బీఆర్ఎస్ (BRS)ను చూస్తే తెలుస్తుందని అనుకొంటున్నారు.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు మరచిపోనీ గుణ పాఠాన్ని నేర్పించగా.. పార్లమెంట్ ఎన్నికలు సైతం ఏ విధమైన రిజల్ట్ ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.

ఇక తెలంగాణ (Telangana)లో లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని ఆశపడుతున్న బీఆర్ఎస్ కు.. కేసీఆర్ (KCR) గతంలో వాడిన అస్త్రాలు తిరిగి ఆయనకే ఎక్కుపెట్టే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.. అసలు బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు.. ఎన్నికలు అంటే ఏదోలా సాగాయి..

కానీ దేశంలో ఉప ఎన్నికను సైతం ఊహించని రేంజ్ కు తీసుకెళ్ళి.. కాస్ట్లీ ఎన్నికగా మార్చింది మాత్రం గులాబీ బాస్ అనే ఆరోపణలున్నాయి.. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఎన్ని ఉపాయాలు చేయాలో అన్ని చేశారు. వివిధ దారుల్లో వెళ్ళి.. ఊహించని అస్త్రాలు ప్రయోగించి.. ప్రలోభాలతో నెగ్గాలని చూశారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా హుజురాబాద్ (Huzurabad), మునుగోడు ఉప ఎన్నికలను పేర్కొంటున్నారు.

ఆ సమయంలో బీఆర్ఎస్ వెదజల్లిన డబ్బు ప్రవాహం చర్చాంశనీయంగా మారింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల ఏం చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు అంగబలం.. అధికార బలం బలహీనంగా మారింది. ఆర్డర్ వేసే స్థాయి నుంచి.. ఆచరించే స్థాయికి రావడంతో.. వ్యవస్థలను మేనేజ్ చేసే దారులు మూసుకు పోయాయి.. గతంలో ఆర్థిక వనరులను సమకూర్చిన వారెవరు ప్రస్తుతం పార్టీ వైపు చూడటం లేదని తెలుస్తోంది.

మరోవైపు విక్టరీ గ్రౌండ్ కాంగ్రెస్ చేతిలో ఉండటంతో ఆ పార్టీకి ఆర్థిక వనరులు పరిపుష్టంగా అందుతాయనేది ఓపెన్ సీక్రెట్ అని తెలుస్తోంది. ఇలాంటి సమయాయంలో బీఆర్ఎస్ ను ఆర్థికంగా ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత కష్టం అయిన పనికాదు.. కాగా గతంలో గులాబీ బాస్ ఆర్థిక వనరులను ఉపయోగించి ఉప ఎన్నికల్లో ఎలాంటి గేమ్ ప్లే చేసి ప్రత్యర్థులను ఓడించారో అందరికి తెలిసిందే..

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) అదే దారిలో వెళ్ళితే నిందలు వేసే బీఆర్ఎస్ నేతలు గతాన్ని గుర్తుంచుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు కొత్త దారులను అలవాటు చేసిన కేసీఆర్ తప్పులే ఆయన పాలిట శాపంగా మారడం మాత్రం తప్పదనే వాదన వినిపిస్తుంది.. అయితే ప్రజలు కోరుకునే మార్పు ఇదికాదని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment