Telugu News » Kamareddy : సంచలనంగా మారిన కామారెడ్డి ఎమ్మెల్యే నిర్ణయం.. ఎవరూ నోరు మెదపకుండా చేశారు..!!

Kamareddy : సంచలనంగా మారిన కామారెడ్డి ఎమ్మెల్యే నిర్ణయం.. ఎవరూ నోరు మెదపకుండా చేశారు..!!

రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకొన్నారు. రోడ్డు వెడల్పు పనులను తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని భావించి, అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి, ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు.

by Venu

కామారెడ్డి (Kamareddy), ఎమ్మెల్యే (MLA) కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Katipalli Venkata Ramana Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకొన్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు. దీంతో కామారెడ్డి ఎమ్మెల్యే పై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరోవైపు కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు అధికారులు నోటీసులివ్వనున్నారు.

ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకొన్నారు. రోడ్డు వెడల్పు పనులను తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని భావించి, అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి, ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. నేటి ఉదయం ఆర్‌అండ్‌బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు.

అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.. నెల రోజుల్లో రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.

అయితే ఎమ్మెల్యే ఇంటినుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో రెండు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. అలాగే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పనులు ఎంత వేగంగా జరుగుతాయో అని ఆలోచిస్తున్నారు..

You may also like

Leave a Comment