Telugu News » Kansai International Airport: మునిగిపోతున్న ఎయిర్‌పోర్టు..!

Kansai International Airport: మునిగిపోతున్న ఎయిర్‌పోర్టు..!

జపాన్‌లోని గ్రేటర్ ఒసాకా ప్రాంతంలో ఉన్న కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ప్రకృతి నియంత్రణను కోల్పోయింది. కొద్ది సంవత్సరాల్లో ఈ విమానాశ్రయం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

by Mano
Kansai International Airport: Japan's sinking airport..!

జపాన్‌(Japan)లోని గ్రేటర్ ఒసాకా ప్రాంతంలో ఉన్న కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(Kansai International Airport) మునిగిపోతోంది. ఈ ఎయిర్‌పోర్టును కృత్రిమ ద్వీపంలో 20బిలియన్‌ డాలర్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ విమానాశ్రయం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Kansai International Airport: Japan's sinking airport..!

ఈ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ప్రకృతి నియంత్రణను కోల్పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం భద్రత కోసం, ఉపరితలం బలంగా ఉండేలా రాళ్లను 80షిప్‌లలో తీసుకువచ్చి 10వేల మంది కార్మికులు, సుమారు 10మిలియన్ గంటల పాటు పనిచేశారు.

రాళ్లను పోసిన తర్వాత దానిపై 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో కృత్రిమ ఉపరితలాన్ని సృష్టించారు. అయినా కూడా సముద్రపు నీటి మట్టం పెరగడంతో ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్ట్‌కు పెను ప్రమాదం అంచున ఉంది. ఒసాకాతో పాటు ఈ ఎయిర్ పోర్ట్ క్యోటో, కోబ్ ప్రజలకు కూడా ప్రధాన రవాణా కేంద్రంగా ఉంటుంది. దీని రన్‌వే దాదాపు 4వేల మీటర్ల పొడవు ఉంది.

ద్వీపంలోని ఈ విమానాశ్రయం బీచ్ నుంచి రెండు మైళ్ల దూరంలో ఉంది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం తర్వాత ఏవియేషన్ హబ్‌గా మారింది. కన్సాయ్ ఎయిర్‌పోర్ట్‌ను 1994 సెప్టెంబర్ 4న ప్రారంభించారు. దీని పనులు 1987లో ప్రారంభమై ఏడేళ్లలో పూర్తి చేశారు. 2016లో ఈ ఎయిర్ పోర్ట్ ఆసియాలో 30వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది. జపాన్‌లో మూడవ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌గా పేరుగాంచింది.

You may also like

Leave a Comment