Telugu News » Karimnagar : కాంగ్రెస్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రణరంగం చేసి పుట్ బాల్ అడుదామని పిలుపు..!

Karimnagar : కాంగ్రెస్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రణరంగం చేసి పుట్ బాల్ అడుదామని పిలుపు..!

గోదావరి నది‌ రెండు వందల కిలోమీటర్ల మేర పారుతూ‌ కళకళాలాడేవని కానీ నాలుగైదు నెలలోనే ఇవన్నీ ఎండిపోయి‌‌ స్మశానంలాగా ఎడారిలాగ‌ మారాయని మండిపడ్డారు.

by Venu
cm kcr

తెలంగాణ (Telangana)లో రాజకీయాలు హిట్ ఎక్కాయి. బీఆర్ఎస్ (BRS)ను గాడిలో పెట్టె పనిలో పడ్డ కేసీఆర్ (KCR), కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.. నేడు ఉమ్మడి కరీంనగర్‌ (Karimnagar) జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నిప్పులు చెరిగారు. పరిపాలనపై అవగాహన లేని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు.

cm-kcr-public-meeting-in-alampurతెలంగాణలో సుమారు 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని ఆరోపించారు. తాను ఐదారు సంవత్సరాల క్రితమే కాళేశ్వరం జలాలతో కరీంనగర్ కి ఇబ్బందులు ఉండవని తెలిపినట్లు గుర్తు చేశారు. గతంలో మానేరు వాగు, అన్నారం బ్యారేజీ కాళేశ్వరం ‌జలాలతో కళకళలాడేదని.. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేసీఆర్ ఆరోపించారు.. వరుద కాలువలని రిజర్వాయర్ లుగా మార్చినాం. నిండు గర్భిణీలాగా కాకతీయ కాలువలు కళకళలాడేవని అన్నారు..

అదేవిధంగా గోదావరి నది‌ రెండు వందల కిలోమీటర్ల మేర పారుతూ‌ కళకళాలాడేవని కానీ నాలుగైదు నెలలోనే ఇవన్నీ ఎండిపోయి‌‌ స్మశానంలాగా ఎడారిలాగ‌ మారాయని మండిపడ్డారు. కరీంనగర్ లో నీటి ఎద్దడి తీవ్రంగా ‌ఉందని తెలిపిన కేసీఆర్.. 2014 కంటే ముందున్న పరిస్థితి ఇప్పుడు పునారవృత్తం అవుతుందని పేర్కొన్నారు. మోసపూరిత‌ మాటలతో‌ ఏర్పడిన ప్రభుత్వం తిరిగి మోసం చేస్తుందని ఆరోపించారు.

ఇది కాలం తెచ్చిన‌ కరువా.. కాంగ్రెస్ ‌తెచ్చిన‌ కరువా అని ప్రశ్నించారు.. రైతులు చనిపోతే ఉలుకు లేదు, పలుకు లేదని తెలిపిన కేసీఆర్.. వారికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అలాగే నష్టపోయిన ‌పంటలకి‌ సైతం నష్ట పరిహారం అందించాలని పేర్కొన్నారు.. తప్పించుకోవాలని‌ చూస్తే వీపు విమానం మోగుతదని హెచ్చరించారు. అదేవిధంగా అధికారులు నేను ఏడికి‌పోతే అక్కడ ‌నీళ్ళు వదులుతున్నారని మండిపడ్డారు.

నేను కరీంనగర్ కి పోతున్న అని తెలిసి కాళేశ్వరం నీరు వదిలారని వెల్లడించారు. చెడిపోయిన కాళేశ్వరం నుంచి నీరు ఎలా వదులుతున్నారని ప్రశ్నించిన ఆయన.. ఈ పనేదో ముందే చేసి ఉంటే.. పంటలు దక్కేవని అన్నారు.. రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతులు వాడుకోకనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.. రైతులకు మాటిచ్చిన రెండు‌లక్షల మాఫీ, నాలుగు నెలలు అయిన‌ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.

బ్యాంకర్లు నోటీసులు ఇస్తే ‌ఎందుకు మాట్లడం లేదని మండిపడ్డారు.. ఇస్తానన్న బోనస్ ఏమైందన్న కేసీఆర్.. వర్షకాలం పంటలకి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ‌వ్యవసాయమే సంక్షోభంలో ఉందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే జనం వెంటాడి కర్రు కాల్చి వాత పెడుతారని హెచ్చరించారు. దళితబంధు హామీపై ఇప్పటివరకి స్పష్టత లేదని పేర్కొన్నారు..

ఇచ్చిన వాగ్ధానాలు నాలుగు నెలలో ఎగగొట్టిన కాంగ్రెస్ నేతలు.. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నిలదీయండని సూచించారు.. కల్యాణ లక్ష్మిలో లక్ష సాయంతో పాటు తులం బంగారం, నాలుగు వేల పెన్షన్ ఇస్తామని గొప్పలకు పోయి ఇప్పుడు సప్పుడు చేస్తలేరని విమర్శించారు. దళితబంధు ఇవ్వకుండా దళితులను, గొర్రెల పంపిణీ ఆపేసి యాదవులను, చేనేతలను ఇలా అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచిందని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యంలో రెండు వందల ఫింఛన్ ఉండేదని.. దాన్ని మేము రెండువేలు చేసామని పేర్కొన్నారు.. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ముఫ్ఫై లక్షల కుటుంబాలకి పింఛన్ ఎగబెట్టారని తెలిపారు.. నాలుగు వందల కొట్ల పాత బకాయిల‌ కోసం కొర్టు మెట్లు ఎక్కుతామని కేసీఆర్ హెచ్చరించారు. మన హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రం అంతా రణరంగం చేసి పుట్ బాల్ అడుదామని పిలుపునిచ్చారు..

You may also like

Leave a Comment