Telugu News » Karimnagar: గుర్తొచ్చిన కర్తవ్యం.. రైతును కాపాడిన కానిస్టేబుల్..!

Karimnagar: గుర్తొచ్చిన కర్తవ్యం.. రైతును కాపాడిన కానిస్టేబుల్..!

ఆవేశంలో విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలని భావించాడు.. ఈ ప్రయత్నంలో భాగంగా తన పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

by Venu

పోలీసులు అంటే దండించడం మాత్రమే కాదు.. దయ చూపి రక్షించడం కూడా తెలినవారని కరీంనగర్ (Karimnagar)జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ నిరూపించారు.. ఆపదలో ఉన్న ఓ రైతు ప్రాణాలు కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకొంటున్నారు.. ఈ సంఘటన వివరాలు చూస్తే.. కరీంనగర్ జిల్లా వీణవంక (Veenavanka) మండలం భేతిగల్‌ (Bhethigal)కు చెందిన కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి కోపంగా తన పొలానికి వెళ్లారు.

ఆవేశంలో విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలని భావించాడు.. ఈ ప్రయత్నంలో భాగంగా తన పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అక్కడ ఉన్న వారు జరగబోయే ప్రమాదాన్ని గమనించి..100కు సమాచారం అందించారు. వెంటనే బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు.

పోలీసులు పొలానికి చేరుకొనే సరికి సురేష్ అపస్మారక స్థితిలో కనిపించాడు.. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొన్న కానిస్టేబుల్.. అంబులెన్స్ కు కాల్ చేస్తే అది వచ్చే సరికి ఆ వ్యక్తి ప్రాణాలు నిలుస్తాయో లేదో అనే అనుమానంతో.. వెంటనే స్పందించారు.. సమయం మించిపోయిన కొద్ది రైతు ప్రాణాలు మిగలవని భావించి.. అతడిని భుజాన వేసుకుని పొలాల మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకొచ్చారు కానిస్టేబుల్ జయపాల్..

కుటుంబ సభ్యుల సాయంతో జమ్మికుంట (Jammikunta) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరోవైపు సకాలంలో సురేష్ ను కాపాడిన బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌, ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.

You may also like

Leave a Comment