Telugu News » Kavitha : కాంగ్రెస్ అంటేనే మోసం కుట్ర మభ్యపెట్టడం..!!

Kavitha : కాంగ్రెస్ అంటేనే మోసం కుట్ర మభ్యపెట్టడం..!!

హిజాబ్ వివాదంపై రాహుల్ గాంధీ తన వైఖరిని వెల్లడించాలని కవిత పేర్కొన్నారు.. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని విమర్శించిన కవిత.. పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని తెలిపారు

by Venu
mlc kavitha

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మౌనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో అప్పుడప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకోవడానికి మీడియా ముందుకు వస్తున్నట్టు జనం మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద కవిత ఫైర్ అయ్యారు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు..

Mlc Kavitha: Another fight for the implementation of women's reservation: Mlc Kavitha

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ.. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు మాట్లాడినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు.. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని తెలుస్తున్నట్టు వెల్లడించారు.. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

హిజాబ్ వివాదంపై రాహుల్ గాంధీ తన వైఖరిని వెల్లడించాలని కవిత పేర్కొన్నారు.. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని విమర్శించిన కవిత.. పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు కొన్ని వర్గాల ఓట్ల కోసం దురదృష్టవశాత్తు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విఛ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని సూచించారు.

దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెబుకుంటున్నారని, కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు. భారత్ జోడో యాత్ర అన్నది కేవలం ప్రచారం కోసమే అని తేలిపోయిందని స్పష్టం చేశారు. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారిగా ఉండాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తోందని ఆరోపించిన కవిత.. హామీలను అమలు చేసి చూపించిన చరిత్ర కాంగ్రెస్ కి లేదని మండిపడ్డారు.. చెప్పింది చేయకపోవడం కాంగ్రెస్ డీఎన్ఏ అని.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని కవిత ధ్వజమెత్తారు.

You may also like

Leave a Comment