Telugu News » Kavitha : శవ రాజకీయాలు కాంగ్రెస్ కే చెల్లు.. కవిత.. !!

Kavitha : శవ రాజకీయాలు కాంగ్రెస్ కే చెల్లు.. కవిత.. !!

ప్రవళ్లిక (Pravalika) ఆత్మహత్య ఘటనలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా ఈ ఘటన పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.

by Venu

ఆత్మహత్యలను కూడా ప్రచారాలకు వాడు కోవడం నేడు రాజకీయాల్లో సాధారణ విషయంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయవలసిన రాజకీయాయ వ్యవస్థ, ధనార్జనే ధ్యేయంగా మారింది. పొంతన లేని హామీలతో అధికారంలోకి వస్తారు.. తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చ లేక కల్లబొల్లి మాటలతో కాలాన్ని గడిపేస్తారు. ఇది నేటి రాజకీయాయ తీరు.

మరోవైపు తెలంగాణ (Telanagana)లో ఓ ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకొంటే.. కారణాలు తెలుసుకొని, ఆ కుటుంబానికి న్యాయం చేయవలసింది పోయి.. ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కాగా హైదరాబాద్ (Hyderabad) అశోక్ నగర్ హాస్టల్ లో ఉంటూ గ్రూప్-2 (Group-2) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని, ప్రవళ్లిక (Pravalika) ఆత్మహత్య ఘటనలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా ఈ ఘటన పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.

బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటామని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని కవిత తెలిపారు.

నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ విమర్శించారు. మీ కుట్రలను బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అంటూ వెల్లడించారు కవిత. చివరికి గ్రూప్ 2 ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయలేదా కవిత అని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు. . మీ ఆవేదన బూటకం.. మీ ఆందోళన నాటకం అంటూ విరుచుకు పడ్డారు..

You may also like

Leave a Comment