ఢిల్లీ (Delhi) లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. ఆమెను మార్చి 15న హైదరాబాద్ (Hyderabad)లో మద్యం కుంభకోణంలో ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసి విచారణ అనంతరం తీహార్ జైలు (Tihar Jail)కి తరలించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం జైలులో ఉన్న కవితను సీబీఐ (CBI) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.
ఇటీవలే లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. కాగా రౌస్ అవెన్యూ కోర్టు.. తీహార్ జైల్లో విచారించేందుకు వారికి అనుమతి ఇచ్చింది.. అయితే విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొన్న సీబీఐ.. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ జరగనుంది.
మరోవైపు కవిత తన కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది. కానీ న్యాయస్థానంలో ఆమెకు చక్కెదురైంది. పిటిషన్ కోర్టు కొట్టేసింది. అలాగే మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకిస్తోంది. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తు పై ప్రభావం ఉంటుందని ఆరోపణలు చేస్తుంది.
ఆమె బయటికి వస్తే సాక్ష్యులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపిస్తున్న ఈడీ.. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని కవిత బెదిరించారని అందుకు ఆధారాలు సైతం ఉన్నాయని వాదనలు వినిపిస్తుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఈ అంశం.. ఎన్నికలు ముగిసే వరకు ఇలాగే ఉత్కంఠంగా సాగుతుందనే టాక్ వినిపిస్తుంది..